మొదటగా ఈ దైవికమైన పవిత్ర గ్రంథరచన, సేకరణ, సంకలనాత్మక కర్తనైన నా గురించి పాఠకదేవుళ్ళకు సవినయంగా మనవి చేసుకోవడం నా విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాను. నేను నెల్లూరు జిల్లాలోని రావిపాడు గ్రామంలో పుణ్యదంపతులైన కొండపల్లి వెంకయ్య, రుక్మిణమ్మ గార్లకు 1954వ సంవత్సరంలో జన్మించాను. మా అమ్మ మహాభక్తురాలు, పుణ్యవంతురాలు, సంస్కారవంతురాలు. మా నాన్నగారు కుటుంబ బాధ్యతలతో తలమునకలై ఉండేవారు. 1974లో మా అమ్మ వైకుంఠప్రాప్తి పొందారు. మా నాన్నగారు వీలున్నప్పుడల్లా ధ్యానానికి (ప్రదక్షిణసేవకు) నా తోటి శ్రీశైలము, ఘటికాచలము (తమిళనాడు) వస్తూ, ఒక మండలము లేక అరమండలము లేక పావు మండలం నాతో ఉండేవారు. నా విద్యాభ్యాసం నెల్లూరు, గుంటూరు, తిరుపతి, హైదరాబాద్
జరిగింది. 1976, 1977వ సంవత్సరాలలో జరిగిన గ్రూప్ -4 సర్వీసెస్లో రాష్ట్ర మొదటి ర్యాంకులోను, గ్రూప్-2 విభాగంలోను మామూలు ర్యాంక్తో ఉద్యోగాలు పొంది, రాష్ట్ర సచివాలయంలో కొంతకాలము ఉద్యోగం చేశాను. తదుపరి వ్యక్తిగత కారణాలపై గుంటూరు విద్యాశాఖకు బదిలీపై రావడం జరిగింది. 1983 కార్తీకమాసంలో భగవంతుని ఆరాధించాలి అనే నిరంతర తపన నన్ను ధ్యానయోగ సాధనకు పురికొల్పింది. 1977లో నా వివాహం జరిగింది. ఇద్దరు సంతానం ఉన్నతోద్యోగాలలో స్థిరపడ్డారు. 2011వ సంవత్స రంలో నేను పదవీ విరమణ చేయడమైంది.
నేను నాగృహంలో నాబ్రాహ్మణ స్నేహితులసలహా సహకారంతో దేవతా రాధనను మొదలెట్టి తొలుతుగా పరమశివ, మహావిష్ణు, శాక్తేయ, లక్ష్మీ, ఆంజనేయ, సుబ్రహ్మణ్య, కాలభైరవ, నారసింహ స్తోత్రాలను ఒక్కొక్కటి 11 సార్లకు తక్కువ కాకుండ శుచి శ్రద్ధ భక్తి అనే మూడు అంగాలు పునాదులుగా చేసుకొని ప్రార్థించాను. కొన్నాళ్లకు నా మానసిక స్థితిలోను, బుద్ధిబలం, ఆత్మస్థైర్యంలోను వచ్చిన మంచి మార్పులను గమనించాను. అదేకాలంలో సత్ గురువుద్వారా మంత్రోపదేశం పొందాలనే బలమైన కోర్కె నాలో కలిగి సద్గురు లక్షణాలు కల్గిన వారి కొరకు 6 నెలల పాటు అన్వేషించాను. చివరకు ఒక వృద్ధ బ్రాహ్మణ వర్యుల ద్వారా బ్రహ్మ చారి, సద్గుణ, సదాచార సంపన్నులైన భూత భవిష్యత్ ద్రష్టఅయినటువంటి శ్రీమాన్ బ్రహ్మశ్రీ వంగర రామాంజనేయ............
ముందుగా సంకలన కర్తయైనటువంటి నా గురించి పాఠకులతో కొన్ని మంచి మాటలు మొదటగా ఈ దైవికమైన పవిత్ర గ్రంథరచన, సేకరణ, సంకలనాత్మక కర్తనైన నా గురించి పాఠకదేవుళ్ళకు సవినయంగా మనవి చేసుకోవడం నా విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాను. నేను నెల్లూరు జిల్లాలోని రావిపాడు గ్రామంలో పుణ్యదంపతులైన కొండపల్లి వెంకయ్య, రుక్మిణమ్మ గార్లకు 1954వ సంవత్సరంలో జన్మించాను. మా అమ్మ మహాభక్తురాలు, పుణ్యవంతురాలు, సంస్కారవంతురాలు. మా నాన్నగారు కుటుంబ బాధ్యతలతో తలమునకలై ఉండేవారు. 1974లో మా అమ్మ వైకుంఠప్రాప్తి పొందారు. మా నాన్నగారు వీలున్నప్పుడల్లా ధ్యానానికి (ప్రదక్షిణసేవకు) నా తోటి శ్రీశైలము, ఘటికాచలము (తమిళనాడు) వస్తూ, ఒక మండలము లేక అరమండలము లేక పావు మండలం నాతో ఉండేవారు. నా విద్యాభ్యాసం నెల్లూరు, గుంటూరు, తిరుపతి, హైదరాబాద్ జరిగింది. 1976, 1977వ సంవత్సరాలలో జరిగిన గ్రూప్ -4 సర్వీసెస్లో రాష్ట్ర మొదటి ర్యాంకులోను, గ్రూప్-2 విభాగంలోను మామూలు ర్యాంక్తో ఉద్యోగాలు పొంది, రాష్ట్ర సచివాలయంలో కొంతకాలము ఉద్యోగం చేశాను. తదుపరి వ్యక్తిగత కారణాలపై గుంటూరు విద్యాశాఖకు బదిలీపై రావడం జరిగింది. 1983 కార్తీకమాసంలో భగవంతుని ఆరాధించాలి అనే నిరంతర తపన నన్ను ధ్యానయోగ సాధనకు పురికొల్పింది. 1977లో నా వివాహం జరిగింది. ఇద్దరు సంతానం ఉన్నతోద్యోగాలలో స్థిరపడ్డారు. 2011వ సంవత్స రంలో నేను పదవీ విరమణ చేయడమైంది. నేను నాగృహంలో నాబ్రాహ్మణ స్నేహితులసలహా సహకారంతో దేవతా రాధనను మొదలెట్టి తొలుతుగా పరమశివ, మహావిష్ణు, శాక్తేయ, లక్ష్మీ, ఆంజనేయ, సుబ్రహ్మణ్య, కాలభైరవ, నారసింహ స్తోత్రాలను ఒక్కొక్కటి 11 సార్లకు తక్కువ కాకుండ శుచి శ్రద్ధ భక్తి అనే మూడు అంగాలు పునాదులుగా చేసుకొని ప్రార్థించాను. కొన్నాళ్లకు నా మానసిక స్థితిలోను, బుద్ధిబలం, ఆత్మస్థైర్యంలోను వచ్చిన మంచి మార్పులను గమనించాను. అదేకాలంలో సత్ గురువుద్వారా మంత్రోపదేశం పొందాలనే బలమైన కోర్కె నాలో కలిగి సద్గురు లక్షణాలు కల్గిన వారి కొరకు 6 నెలల పాటు అన్వేషించాను. చివరకు ఒక వృద్ధ బ్రాహ్మణ వర్యుల ద్వారా బ్రహ్మ చారి, సద్గుణ, సదాచార సంపన్నులైన భూత భవిష్యత్ ద్రష్టఅయినటువంటి శ్రీమాన్ బ్రహ్మశ్రీ వంగర రామాంజనేయ............© 2017,www.logili.com All Rights Reserved.