"కృష్ణం వందే జగద్గురుం." అనగానే శ్రీ కృష్ణుడు అతని లీలా విలాసాల చరిత్ర గుర్తుకు వస్తూంది. ఈ దేశం చేసుకున్న అదృష్టంగా "రామ, కృష్ణులు" ఈ మానవాళి నరనరాలలోని రక్త ప్రసరణలో కలిసిపోయారు.
రామునికి నిదర్శనం "హనుమంతుడు." అతని"యత్ర యత్ర రఘునాధ కీర్తనం" మనకు మచ్చుతునకలు, నిదర్శన - ఆదర్శాలు. అలాగే "కృష్ణా" అనగానే - కాలు నోట్లో పెట్టుకున్న "వటపత్ర" శాయిగా - క్రిష్ణదర్శనం కల్గుతుంది. బ్రహ్మానంద ముదయింప చేస్తుంది. అది "శ్రీకృష్ణ భాగవతం".
అందరూ "ఎప్పుడో చెప్పిన భగవద్గీతను "కృష్ణా! అనగానే గుర్తు చేసుకుంటారు. యశోద కన్నులతో చుస్తే, అల్లరి-పిల్లల-చేష్టలతో, నవ్వుతూ పలుకరిస్తాడు. అమాయకంగా చూస్తూ, అందని హృదయనందాన్ని, అందుకోమని ప్రసాదిస్తాడు.
మన్ను తిని అమ్మకు,"మన్నేమిటి? సకల భువనాలను చూపించాడంటే, నిజంగా బ్రహ్మాండ నాయకుడే! పాలు త్రాగే వయస్సులో "పూతన"ను చంపాడంటే, ఆ తర్వాత కాళ్ళతో శకటాసురుడిని, ఎగిరి తృణావర్తుని, తిరిగి ధేనుకాసురుని... ఇలాగ ఎంతమందిని చంపాడో, ఎందరికి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించాడో తలుచుకుంటే... అదే కృష్ణ భాగవతం. అదే "కృష్ణం వందే జగద్గురుం."
మూడు గ్రంధాల శ్రీకృష్ణ చరిత్రను శ్రీకృష్ణ భగవతత్వాన్ని లీలా విశేషాల చరిత్రను, ధరిత్రి మెచ్చేలాగున అందించడం జరిగింది.ఇందులో కొన్ని విశేషాలు, లీలలు దర్శనమిస్తాయి. అద్బుతానందాన్ని ప్రసాదిస్తాయి. ఇందులో కృష్ణుడు - అవతార పురుషుడు, లీలా వినోదుడు, సర్వశక్తి సంపన్నుడు, నిజమైన "శూర" వీరుడిగా, వాసుదేవుడై దర్శనమిస్తాడు. తన వాళ్ళందరిని తరింప చేస్తాడు.
ప్రధమ భాగం - భక్తి కాండ (చరిత్రలు, లీలలు)
ద్వితీయ భాగం - జ్ఞాన కాండ (లీలలు, ధర్మ పరిరక్షణ)
తృతీయ భాగం - ముక్తి కాండ (ముక్తి, వైరాగ్యము)
మూడు భాగాలను మొత్తం వర్ణించడం సాధ్యం కాదు కానీ, పటించి, ఆనందం పొందడం మాత్రం సులభ సాధ్యము.
"కృష్ణం వందే జగద్గురుం." అనగానే శ్రీ కృష్ణుడు అతని లీలా విలాసాల చరిత్ర గుర్తుకు వస్తూంది. ఈ దేశం చేసుకున్న అదృష్టంగా "రామ, కృష్ణులు" ఈ మానవాళి నరనరాలలోని రక్త ప్రసరణలో కలిసిపోయారు. రామునికి నిదర్శనం "హనుమంతుడు." అతని"యత్ర యత్ర రఘునాధ కీర్తనం" మనకు మచ్చుతునకలు, నిదర్శన - ఆదర్శాలు. అలాగే "కృష్ణా" అనగానే - కాలు నోట్లో పెట్టుకున్న "వటపత్ర" శాయిగా - క్రిష్ణదర్శనం కల్గుతుంది. బ్రహ్మానంద ముదయింప చేస్తుంది. అది "శ్రీకృష్ణ భాగవతం". అందరూ "ఎప్పుడో చెప్పిన భగవద్గీతను "కృష్ణా! అనగానే గుర్తు చేసుకుంటారు. యశోద కన్నులతో చుస్తే, అల్లరి-పిల్లల-చేష్టలతో, నవ్వుతూ పలుకరిస్తాడు. అమాయకంగా చూస్తూ, అందని హృదయనందాన్ని, అందుకోమని ప్రసాదిస్తాడు. మన్ను తిని అమ్మకు,"మన్నేమిటి? సకల భువనాలను చూపించాడంటే, నిజంగా బ్రహ్మాండ నాయకుడే! పాలు త్రాగే వయస్సులో "పూతన"ను చంపాడంటే, ఆ తర్వాత కాళ్ళతో శకటాసురుడిని, ఎగిరి తృణావర్తుని, తిరిగి ధేనుకాసురుని... ఇలాగ ఎంతమందిని చంపాడో, ఎందరికి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించాడో తలుచుకుంటే... అదే కృష్ణ భాగవతం. అదే "కృష్ణం వందే జగద్గురుం." మూడు గ్రంధాల శ్రీకృష్ణ చరిత్రను శ్రీకృష్ణ భగవతత్వాన్ని లీలా విశేషాల చరిత్రను, ధరిత్రి మెచ్చేలాగున అందించడం జరిగింది.ఇందులో కొన్ని విశేషాలు, లీలలు దర్శనమిస్తాయి. అద్బుతానందాన్ని ప్రసాదిస్తాయి. ఇందులో కృష్ణుడు - అవతార పురుషుడు, లీలా వినోదుడు, సర్వశక్తి సంపన్నుడు, నిజమైన "శూర" వీరుడిగా, వాసుదేవుడై దర్శనమిస్తాడు. తన వాళ్ళందరిని తరింప చేస్తాడు. ప్రధమ భాగం - భక్తి కాండ (చరిత్రలు, లీలలు) ద్వితీయ భాగం - జ్ఞాన కాండ (లీలలు, ధర్మ పరిరక్షణ) తృతీయ భాగం - ముక్తి కాండ (ముక్తి, వైరాగ్యము) మూడు భాగాలను మొత్తం వర్ణించడం సాధ్యం కాదు కానీ, పటించి, ఆనందం పొందడం మాత్రం సులభ సాధ్యము.© 2017,www.logili.com All Rights Reserved.