కథంతా 2016 సెప్టెంబర్ 16న ప్రారంభమైంది. ఆ రోజున జైభారత్ ఆశయాల్ని జనబాహుళ్యంతో ప్రచారం చేసే లక్ష్యంతో,హైదరాబాద్ లో ఖల్సాస్ఫూర్తి భవనంలో 'ఖాదిజ్ఞాసి క్రాంతికారి కళామంచ్, ఆవిర్భవించింది. కానేటి కృష్ణమూర్తి (అలియాస్ చిన్నన్న) ఈ సంస్థకి కన్వీనర్. చంద్రిక, ఆర్తి, మల్లికా వల్లభ కో - కన్వీనర్లు. 'ఖాదిజ్ఞాసి క్రాంతికారి కళామంచ్' ఆవిర్భావం ఒక మలుపు. జైభారత్ ఎంత విశిష్టమైన సంస్థ అయినా, ఏ స్థాయిలో పనిచేసుతున్నా సంస్థకి తనవంటూ ప్రత్యేకించి పాటలు ఏవీ లేకపోవడం తోలినుంచీ లోటుగానే వుండింది. 3 రాష్ట్రాల్లో వేలాదిజనం హాజరైన అసంఖ్యాక జైభారత్ కార్యక్రమాల్లోనూ, సభల్లోనూ.. అప్పటికే జనంలో ప్రాచుర్యంలో వుండే ప్రజా గీతాలు కొన్ని వినిపించేవి. కానీ.. అవన్నీ వేరే సంస్థలు, వేరే రచయితలు, వేరే సందర్భాలకు రాసినవి. అవి మంచివే, గొప్పవే. కానీ.. అవి జైభారత్ విశిష్టతనీ, జైభారత్ దృక్పథాన్నీ కచ్చితంగా పట్టిచ్చేవి కావు. అడపాదడపా ఔత్సాహికులైన కొందరు కార్యకర్తలు జైభారత్ కంటూ కొన్ని గీతాలు రాసేందుకు ప్రయత్నం చెయ్యకపోలేదు, కానీ.. అవేవీ.. సమగ్రమైన ప్రయత్నాలుగా నిలబడలేదు.
- విజయవిహారం రమణమూర్తి