అనాది నుండి మానవుడు సుఖ జీవనము కొరకు పాటుపడుచున్నాడు. తను సంపాదించిన జ్ఞానమును, అనుభవమును తన వారసులకు తెలియచేయుటద్వారా జ్ఞానము అభివృద్ధికి బాటలు వేయుచున్నాడు. ఈ జ్ఞానమును ఆలంబనగా చేసుకుని దాని విస్తృతికి తనకు లభించిన జ్ఞానమును తరతరాల నుండి వృద్ధి చెందుచూ మానవుడు సౌఖ్యవంతమైన జీవనము గడుపుటకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రకృతిలోని పంచభూతములైన భూమి, అగ్ని, వాయు, జలము, ఆకాశము తన అభ్యున్నతికి ఉపయోగించుకొనుచున్నాడు. చెట్టు తొర్రలను, కొండగుహలలో నివసించిన మానవుడు ఈ ప్రకృతిలోని పంచభూతముల శక్తిని నుండి తనను తాను రక్షించుకొనుటకు నిరంతర పరిశోధన ద్వారా సౌఖ్య జీవనమునకు గృహ నిర్మాణము గావించుకొనినాడు.
తను నిర్మించుకున్న ఇంటిలోకి ప్రకృతి సంబంధిత శక్తులైన పంచభూతాల అనుకూల సమ్మేళనము వలన ఆరోగ్యవంతమైన జీవనమును గడుపుచున్నాడు. మానవాతీతమైన అతీంద్రియ శక్తి ప్రకృతిని నడిపించుచున్నదని నమ్మినాడు. ఆ అతీంద్రియ శక్తి తనను కూడా నడిపించుచున్నదని భావించినాడు. తద్వారా సృష్టిని అర్థంచేసుకోవడానికి జరిగిన ప్రయత్నములే శాస్త్ర రూపములుగా విజ్ఞానము వృద్ధిచెందుతుంది.
అనాది నుండి మానవుడు సుఖ జీవనము కొరకు పాటుపడుచున్నాడు. తను సంపాదించిన జ్ఞానమును, అనుభవమును తన వారసులకు తెలియచేయుటద్వారా జ్ఞానము అభివృద్ధికి బాటలు వేయుచున్నాడు. ఈ జ్ఞానమును ఆలంబనగా చేసుకుని దాని విస్తృతికి తనకు లభించిన జ్ఞానమును తరతరాల నుండి వృద్ధి చెందుచూ మానవుడు సౌఖ్యవంతమైన జీవనము గడుపుటకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రకృతిలోని పంచభూతములైన భూమి, అగ్ని, వాయు, జలము, ఆకాశము తన అభ్యున్నతికి ఉపయోగించుకొనుచున్నాడు. చెట్టు తొర్రలను, కొండగుహలలో నివసించిన మానవుడు ఈ ప్రకృతిలోని పంచభూతముల శక్తిని నుండి తనను తాను రక్షించుకొనుటకు నిరంతర పరిశోధన ద్వారా సౌఖ్య జీవనమునకు గృహ నిర్మాణము గావించుకొనినాడు. తను నిర్మించుకున్న ఇంటిలోకి ప్రకృతి సంబంధిత శక్తులైన పంచభూతాల అనుకూల సమ్మేళనము వలన ఆరోగ్యవంతమైన జీవనమును గడుపుచున్నాడు. మానవాతీతమైన అతీంద్రియ శక్తి ప్రకృతిని నడిపించుచున్నదని నమ్మినాడు. ఆ అతీంద్రియ శక్తి తనను కూడా నడిపించుచున్నదని భావించినాడు. తద్వారా సృష్టిని అర్థంచేసుకోవడానికి జరిగిన ప్రయత్నములే శాస్త్ర రూపములుగా విజ్ఞానము వృద్ధిచెందుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.