'ఆయుర్వేదము' అతి ప్రాచీనమైనది. ఈ వైద్యమును గురించి 'ధన్వంతరి' యేగాక ఎందరో పుంగవులు మహనీయులు ఎన్నో గ్రంథములను రచించి యున్నారు. 'అల్లోపతి' వైద్య విధానమునకు ముందు మన దేశములో ఆయుర్వేదము మిగుల ప్రసిద్ధిగాంచింది. "ఆయుర్వేదము ఆయుష్షును వృద్ధి చేయుటయే గాక కాయసిద్ధిని కలిగించును" అనుటలో అతిశయోక్తి లేదు. ఎట్టివ్యాధులనైనను తక్కువ ఖర్చుతో నయము చేసి ఎక్కువ ఫలితము నిస్తుంది.
21 వ శతాబ్దములో ఆయుర్వేద వైద్యమే ప్రముఖముగా భాసించే సూచనలు కాన వస్తున్నవి. కాబట్టి యావద్భారత జాతి ఆయుర్వేద గ్రంథములను పఠించి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులనుండి గ్రహించి ఆయుర్వేద వైద్యోన్నతిని తెలుసుకోవలసి ఉన్నది. ఈ గ్రంథము సర్వజనోయుక్తము కావాలనే సదుద్దేశముతో మూలికలు, దినుసులు అమ్మే పచారీ షాప్స్ లోనూ, యునానీ ఔషదములు అమ్మే షాప్స్ లోను సులభముగా లభించునట్టి వస్తువులను మాత్రమే సూచించుట జరిగినది. ఈ నా సదాశాయమును సర్వులు గుర్తించి, ఆదరిస్తారని ఆశిస్తూ...
- డి ఆది నారాయణరావు
'ఆయుర్వేదము' అతి ప్రాచీనమైనది. ఈ వైద్యమును గురించి 'ధన్వంతరి' యేగాక ఎందరో పుంగవులు మహనీయులు ఎన్నో గ్రంథములను రచించి యున్నారు. 'అల్లోపతి' వైద్య విధానమునకు ముందు మన దేశములో ఆయుర్వేదము మిగుల ప్రసిద్ధిగాంచింది. "ఆయుర్వేదము ఆయుష్షును వృద్ధి చేయుటయే గాక కాయసిద్ధిని కలిగించును" అనుటలో అతిశయోక్తి లేదు. ఎట్టివ్యాధులనైనను తక్కువ ఖర్చుతో నయము చేసి ఎక్కువ ఫలితము నిస్తుంది. 21 వ శతాబ్దములో ఆయుర్వేద వైద్యమే ప్రముఖముగా భాసించే సూచనలు కాన వస్తున్నవి. కాబట్టి యావద్భారత జాతి ఆయుర్వేద గ్రంథములను పఠించి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులనుండి గ్రహించి ఆయుర్వేద వైద్యోన్నతిని తెలుసుకోవలసి ఉన్నది. ఈ గ్రంథము సర్వజనోయుక్తము కావాలనే సదుద్దేశముతో మూలికలు, దినుసులు అమ్మే పచారీ షాప్స్ లోనూ, యునానీ ఔషదములు అమ్మే షాప్స్ లోను సులభముగా లభించునట్టి వస్తువులను మాత్రమే సూచించుట జరిగినది. ఈ నా సదాశాయమును సర్వులు గుర్తించి, ఆదరిస్తారని ఆశిస్తూ... - డి ఆది నారాయణరావు© 2017,www.logili.com All Rights Reserved.