రచయిత, కవి, స్వరకర్త, యోగి, పదకవితా పితామహుడు, మహా వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు అయిన తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన 32000 సంకీర్తనలలో సుమారు 13 వేలు మాత్రమే మనకు లభ్యమైనవి. ఆ కీర్తనలలో ఆధ్యాత్మిక, తత్వ, శృంగార, జానపద, లలిత శైలి ఎంతో అద్భుతమైన కృషి. నవ విధాలుగా భక్తుల హృదయ క్షేత్రాలను సఫలవంతం చేసిన భక్తి అనే మహాభవ వాహిణి పూజాభూతమై సాకారమై ఆంధ్ర దేశమున అన్నమయ్య గా అవతరించింది. ఇది ఆంధ్రుల అపూర్వ అదృష్టం. భక్తితో మైమరిచి అందరికి "అభయమిచ్చే చేయిని" "బ్రహ్మ కడిగిన పాదమును" మైమరిచి వర్ణించాడు. ఒకసారి "కోనేటి రాయడుగా" "చిన్న శిశువు" గా స్వామిని దర్శించిన ధన్యుడు. ఇద్దరు తల్లులు ముద్దు బిడ్డడైన శ్రీ కృష్ణున్ని "ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు" అని, "పదివేల శేషుల పడగల మయము" గా "అలకల కులుకుల అలమేలు మంగ" దివ్య నృత్యాన్ని, సకల జీవరాశులలో పరబ్రహ్మ వ్యాపించి ఉన్నాడని, జాతి, కుల, మత, వర్ణ వ్యత్యాసం లేదని చెప్పిన అచ్చ తెలుగు పద సంకీర్తనావళీని మీకోసం వ్యవప్రయాసలకోర్చి రచయిత గారు ముద్రించినదే ఈ గ్రంథం.
-వైద్య శ్రీ లొల్ల రామచంద్రరావు.
రచయిత, కవి, స్వరకర్త, యోగి, పదకవితా పితామహుడు, మహా వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు అయిన తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన 32000 సంకీర్తనలలో సుమారు 13 వేలు మాత్రమే మనకు లభ్యమైనవి. ఆ కీర్తనలలో ఆధ్యాత్మిక, తత్వ, శృంగార, జానపద, లలిత శైలి ఎంతో అద్భుతమైన కృషి. నవ విధాలుగా భక్తుల హృదయ క్షేత్రాలను సఫలవంతం చేసిన భక్తి అనే మహాభవ వాహిణి పూజాభూతమై సాకారమై ఆంధ్ర దేశమున అన్నమయ్య గా అవతరించింది. ఇది ఆంధ్రుల అపూర్వ అదృష్టం. భక్తితో మైమరిచి అందరికి "అభయమిచ్చే చేయిని" "బ్రహ్మ కడిగిన పాదమును" మైమరిచి వర్ణించాడు. ఒకసారి "కోనేటి రాయడుగా" "చిన్న శిశువు" గా స్వామిని దర్శించిన ధన్యుడు. ఇద్దరు తల్లులు ముద్దు బిడ్డడైన శ్రీ కృష్ణున్ని "ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు" అని, "పదివేల శేషుల పడగల మయము" గా "అలకల కులుకుల అలమేలు మంగ" దివ్య నృత్యాన్ని, సకల జీవరాశులలో పరబ్రహ్మ వ్యాపించి ఉన్నాడని, జాతి, కుల, మత, వర్ణ వ్యత్యాసం లేదని చెప్పిన అచ్చ తెలుగు పద సంకీర్తనావళీని మీకోసం వ్యవప్రయాసలకోర్చి రచయిత గారు ముద్రించినదే ఈ గ్రంథం. -వైద్య శ్రీ లొల్ల రామచంద్రరావు.© 2017,www.logili.com All Rights Reserved.