అష్టాదశ పురాణాలలో, రామాయణ, భారత ఇతిహాసాలలో ఎంతోమంది మహర్షులు, పతివ్రతలు, స్త్రీ పురుష దేవతలు, అసురులు, వివిధ ప్రదేశాలు, పుణ్యస్థలాలు, తీర్థాలు, క్షేత్రాలు, మహారాజులు, కావ్యాలు లాంటి ఎన్నో విశేషాలు చెప్పబడ్డాయి. ఈ పురాణాల్లో చెప్పబడ్డ విషయాల గురించి సంక్షిప్తంగానైనా తెలుసుకోవటం భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. మన సంస్కృతీ సంప్రదాయాలకి ప్రతీకలైన వారిని గురించిన ప్రాథమిక జ్ఞానం అందరికీ అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి, కొందరు రచయితలు పూర్వగాథాలహరి, పురాణనామచంద్రిక, పురాణనామకోశము లాంటి గ్రంథాలని సంకలనం చేసి పాఠకులకి అందించారు.
మేముకూడా మా ప్రచురణ సంస్థ ద్వారా సంక్షిప్త "పురాణనామ విజ్ఞానము" అనే పేరుతో ఒక గ్రంథాన్ని ప్రచురించి మీకందిస్తున్నాం. ఇందులో పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ఎన్నో విశేషాలని సంగ్రహంగా పొందుపరిచాం. పూర్వగ్రంథాల ఆధారంగా రూపొందిన ఈ గ్రంథంలోని భాషని నేటి పాఠకులకు అనుగుణంగా కొంచెం సరళతరం చేశాము. దీనితోపాటు అనుబంధంగా ప్రసిద్ధి పొందిన కొన్ని పరిభాషా పదాల్ని ఏర్చికూర్చి సంఖ్యావాచక పదవిజ్ఞానం అనే పేరుతో ఇస్తున్నాం.
అష్టాదశ పురాణాలలో, రామాయణ, భారత ఇతిహాసాలలో ఎంతోమంది మహర్షులు, పతివ్రతలు, స్త్రీ పురుష దేవతలు, అసురులు, వివిధ ప్రదేశాలు, పుణ్యస్థలాలు, తీర్థాలు, క్షేత్రాలు, మహారాజులు, కావ్యాలు లాంటి ఎన్నో విశేషాలు చెప్పబడ్డాయి. ఈ పురాణాల్లో చెప్పబడ్డ విషయాల గురించి సంక్షిప్తంగానైనా తెలుసుకోవటం భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. మన సంస్కృతీ సంప్రదాయాలకి ప్రతీకలైన వారిని గురించిన ప్రాథమిక జ్ఞానం అందరికీ అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి, కొందరు రచయితలు పూర్వగాథాలహరి, పురాణనామచంద్రిక, పురాణనామకోశము లాంటి గ్రంథాలని సంకలనం చేసి పాఠకులకి అందించారు. మేముకూడా మా ప్రచురణ సంస్థ ద్వారా సంక్షిప్త "పురాణనామ విజ్ఞానము" అనే పేరుతో ఒక గ్రంథాన్ని ప్రచురించి మీకందిస్తున్నాం. ఇందులో పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ఎన్నో విశేషాలని సంగ్రహంగా పొందుపరిచాం. పూర్వగ్రంథాల ఆధారంగా రూపొందిన ఈ గ్రంథంలోని భాషని నేటి పాఠకులకు అనుగుణంగా కొంచెం సరళతరం చేశాము. దీనితోపాటు అనుబంధంగా ప్రసిద్ధి పొందిన కొన్ని పరిభాషా పదాల్ని ఏర్చికూర్చి సంఖ్యావాచక పదవిజ్ఞానం అనే పేరుతో ఇస్తున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.