ఇందులో ప్రతి అంశం మనకి జ్ఞానాన్ని ప్రసాదించే వ్యాసంలాగా కనబడుతుంది. మొత్తం మీద సుమారు 250 అంశాలు ఇందులో ప్రస్తావించబడినాయి.ఇందులో ప్రస్తావించబడిన ప్రతి అంశం ఒక జ్ఞాన తేజ పుంజంలాగా భాసిల్లుతుంది. ఇందులో ప్రధానంగా ఆగమసంప్రదాయాన్ని, విగ్రహారాదన ఏర్పడిన తొలినాళ్ళ నుంచి తదుపరి దశ వరకు జరిగిన క్రమం వివరించబడినది.
ఇది తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఈ మాట ఎందుకంటున్నానో అన్నది తెలియాలంటే మన చుట్టూ ఉన్న వర్తమాన దృశ్యాన్ని చూద్దాం. గుడిని కట్టడం చాలా మంది ఒక infra – structure issue గా చూసే రోజులు వచ్చాయి. అంటే గుడిని ఒక నిర్మాణంగా భావిస్తున్నాము. ఇది తప్పు. గుడి ఒక వ్యవస్థ. అనేక విషయ సమస్యలను దాటుకుంటూ వందలాది సంవత్సరాలుగా కొనసాగిన, కొనసాగాల్సిన వ్యవస్థ. అందుకనే పెద్దలు దీనిని ఒక నియమబద్ధమైన, శాస్త్రీయమైన విజ్ఞానంగా రూపొందించారు. వాటినే మనం ఇవాళ ‘ఆగమాలు’ అని పిలుస్తున్నాము. స్థలం, కాలం అర్హమైన పూజా వ్యవస్థలు అన్నీ చక్కగా ఒనగూడితేనే ఇది చక్కని వ్యవస్థగా కొనసాగుతుంది. దానికోసమే ఆగమంలో విస్తృతమైన ఏర్పాట్లు, నియమాలు చెప్పారు.
ఇందులో ప్రతి అంశం మనకి జ్ఞానాన్ని ప్రసాదించే వ్యాసంలాగా కనబడుతుంది. మొత్తం మీద సుమారు 250 అంశాలు ఇందులో ప్రస్తావించబడినాయి.ఇందులో ప్రస్తావించబడిన ప్రతి అంశం ఒక జ్ఞాన తేజ పుంజంలాగా భాసిల్లుతుంది. ఇందులో ప్రధానంగా ఆగమసంప్రదాయాన్ని, విగ్రహారాదన ఏర్పడిన తొలినాళ్ళ నుంచి తదుపరి దశ వరకు జరిగిన క్రమం వివరించబడినది. ఇది తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఈ మాట ఎందుకంటున్నానో అన్నది తెలియాలంటే మన చుట్టూ ఉన్న వర్తమాన దృశ్యాన్ని చూద్దాం. గుడిని కట్టడం చాలా మంది ఒక infra – structure issue గా చూసే రోజులు వచ్చాయి. అంటే గుడిని ఒక నిర్మాణంగా భావిస్తున్నాము. ఇది తప్పు. గుడి ఒక వ్యవస్థ. అనేక విషయ సమస్యలను దాటుకుంటూ వందలాది సంవత్సరాలుగా కొనసాగిన, కొనసాగాల్సిన వ్యవస్థ. అందుకనే పెద్దలు దీనిని ఒక నియమబద్ధమైన, శాస్త్రీయమైన విజ్ఞానంగా రూపొందించారు. వాటినే మనం ఇవాళ ‘ఆగమాలు’ అని పిలుస్తున్నాము. స్థలం, కాలం అర్హమైన పూజా వ్యవస్థలు అన్నీ చక్కగా ఒనగూడితేనే ఇది చక్కని వ్యవస్థగా కొనసాగుతుంది. దానికోసమే ఆగమంలో విస్తృతమైన ఏర్పాట్లు, నియమాలు చెప్పారు.© 2017,www.logili.com All Rights Reserved.