వ్యాఖ్యాత గురించి...
ఆచార్య విశ్వకర్మ కందుకూరి వేంకట గోవిందేశ్వరశర్మగారు ప్రకాశంజిల్లా రావినూతల గ్రామంలో సంప్రదాయ శిల్పా చార్య కుటు శ్రీకందుకూరి మణిభూషణాచార్య, శ్రీమతి గంగలక్ష్మమ్మ దంపతుల ఏక సంతానంగా 1-1-1960న గోవిందేశ్వరశర్మగారు జన్మించారు.
చిన్ననాటి నుండే వారి పెదతండ్రిగారు శ్రీయామబ్రహ్మయాచార్యులవరు సంప్రదాయ విషయాలు, శ్రీదక్షిణామూర్తి పంతులుగారి వద్ద ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన వారు ఉపనయనానంతరం వేదవిద్యాభ్యాసం కోసం కన్న ఊరు విడిచి తెనాలి చేరారు.
శ్రీ యలవర్తి ఆంజనేయశాస్త్రిగారి వేద సంస్కృత పాఠశాలలో అప్పటికే వీరి అన్నయ్య శ్రీవేంకటాచార్యులు గారు సంస్కృతం అభ్యసిస్తుండగా వీరు వేదాభిలాషతో శ్రీపామర్తి నాగభూషణశర్మగారి వద్ద వేదపాఠం, షోడశ సంస్కారాలు, ప్రతిషా విధానం మొదలైనవి చదువుకున్నారు. అనంతరం శ్రీ కడారు కూర్మాచార్యసిద్దాంతిగారి వద్ద జ్యోతిష్యం, శ్రీ అద్దంకి నాగయాచార్య సిద్ధాంతిగారి వద్ద ప్రతిష్ఠా సంబంధమైన ప్రయోగ విషయాలను అభ్యసించారు.
విజయవాడ నగరానికి వచ్చి విశ్వబ్రాహ్మణులకు ప్రియమైన పురోహితులుగా సుమారు నాలుగు దశాబ్దాలుగా సేవలు అందించారు. విశ్వకర్మజ్యోతి అనే మాసపత్రికను ఒక దశాబానికి పైగా నడిపారు. నాలుగు దశాబాల పౌరోహిత్య ప్రయాణంలో ఐదువందలకు పైగా ప్రతిషా కార్యక్రమాలను నిర్వహించారు. దేశమంతటా అనేక యజ్ఞయాగాది కార్యక్రమాలకు ప్రధాన ఆధ్వర్యం వహించారు.
ఆంధ్రరాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ గౌరవాధ్యక్షులుగా 10 సంవత్సరాలు, అధ్యక్షులుగా 20 సంవత్సరాలు కొనసాగారు. వీరి విద్యత్తుకు, వైదిక సేవలకు ఇంతవరకు అనేక సువర్ణహస్త ఘంటాకంకణాలు, సువర్ణ యజోపవీతం, సువర్ణ అంగుళీయకం సన్మానాలు ఎన్నో జరిగాయి.
విశ్వకర్మ సంప్రదాయ సాహిత్యాన్ని ఎల్లెడలా ప్రచారం చేయడానికై కందుకూరి యామబ్రహ్మయాచార్య శిల్పవాజ్మయపీఠం స్థాపించి ఆగమ, వాస్తు, శిల్పానికి సంబంధించిన అనేక గ్రంథాలను ప్రచురించారు.
కడపజిల్లా కందిమల్లయ్యపల్లె బ్రహ్మంగారిమఠంలో ఆధ్వర్యులుగా, మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామివారి ప్రియశిష్యులుగా తరించి 2021 మే 6వ తేదీన బ్రహ్మపదం పొందారు.
ప్రస్తుతం వీరి ఆశయాలను, ఆదేశాలను వారి పుత్రులు శ్రీ కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.............
వ్యాఖ్యాత గురించి... ఆచార్య విశ్వకర్మ కందుకూరి వేంకట గోవిందేశ్వరశర్మగారు ప్రకాశంజిల్లా రావినూతల గ్రామంలో సంప్రదాయ శిల్పా చార్య కుటు శ్రీకందుకూరి మణిభూషణాచార్య, శ్రీమతి గంగలక్ష్మమ్మ దంపతుల ఏక సంతానంగా 1-1-1960న గోవిందేశ్వరశర్మగారు జన్మించారు. చిన్ననాటి నుండే వారి పెదతండ్రిగారు శ్రీయామబ్రహ్మయాచార్యులవరు సంప్రదాయ విషయాలు, శ్రీదక్షిణామూర్తి పంతులుగారి వద్ద ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన వారు ఉపనయనానంతరం వేదవిద్యాభ్యాసం కోసం కన్న ఊరు విడిచి తెనాలి చేరారు. శ్రీ యలవర్తి ఆంజనేయశాస్త్రిగారి వేద సంస్కృత పాఠశాలలో అప్పటికే వీరి అన్నయ్య శ్రీవేంకటాచార్యులు గారు సంస్కృతం అభ్యసిస్తుండగా వీరు వేదాభిలాషతో శ్రీపామర్తి నాగభూషణశర్మగారి వద్ద వేదపాఠం, షోడశ సంస్కారాలు, ప్రతిషా విధానం మొదలైనవి చదువుకున్నారు. అనంతరం శ్రీ కడారు కూర్మాచార్యసిద్దాంతిగారి వద్ద జ్యోతిష్యం, శ్రీ అద్దంకి నాగయాచార్య సిద్ధాంతిగారి వద్ద ప్రతిష్ఠా సంబంధమైన ప్రయోగ విషయాలను అభ్యసించారు. విజయవాడ నగరానికి వచ్చి విశ్వబ్రాహ్మణులకు ప్రియమైన పురోహితులుగా సుమారు నాలుగు దశాబ్దాలుగా సేవలు అందించారు. విశ్వకర్మజ్యోతి అనే మాసపత్రికను ఒక దశాబానికి పైగా నడిపారు. నాలుగు దశాబాల పౌరోహిత్య ప్రయాణంలో ఐదువందలకు పైగా ప్రతిషా కార్యక్రమాలను నిర్వహించారు. దేశమంతటా అనేక యజ్ఞయాగాది కార్యక్రమాలకు ప్రధాన ఆధ్వర్యం వహించారు. ఆంధ్రరాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ గౌరవాధ్యక్షులుగా 10 సంవత్సరాలు, అధ్యక్షులుగా 20 సంవత్సరాలు కొనసాగారు. వీరి విద్యత్తుకు, వైదిక సేవలకు ఇంతవరకు అనేక సువర్ణహస్త ఘంటాకంకణాలు, సువర్ణ యజోపవీతం, సువర్ణ అంగుళీయకం సన్మానాలు ఎన్నో జరిగాయి. విశ్వకర్మ సంప్రదాయ సాహిత్యాన్ని ఎల్లెడలా ప్రచారం చేయడానికై కందుకూరి యామబ్రహ్మయాచార్య శిల్పవాజ్మయపీఠం స్థాపించి ఆగమ, వాస్తు, శిల్పానికి సంబంధించిన అనేక గ్రంథాలను ప్రచురించారు. కడపజిల్లా కందిమల్లయ్యపల్లె బ్రహ్మంగారిమఠంలో ఆధ్వర్యులుగా, మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామివారి ప్రియశిష్యులుగా తరించి 2021 మే 6వ తేదీన బ్రహ్మపదం పొందారు. ప్రస్తుతం వీరి ఆశయాలను, ఆదేశాలను వారి పుత్రులు శ్రీ కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.............© 2017,www.logili.com All Rights Reserved.