వేదార్థాలను సంకీర్తనలుగా పాడి పండితులనే కాక పామరులను గూడా పరవశింపజేసినా మహానుభావుడు తాళ్ళపాక అన్నమయ్య. జీవిత పరమార్థాన్ని తాను చవిచూచి ఇతరులకు కూడా దాని రుచి అందించాలన్న దృష్టితో ఆయన వేలకొలది పదాల ద్వారా భాగవత్తత్త్వాన్ని ప్రచారం చేశాడు. సంగీత సాహిత్యాల పెన్నిధిగా పేరొందిన అన్నమయ్య సారస్వతం నేడు అనన్యసామాన్యమైన ప్రచారం పొందడం ముదావహం. తద్వారా ప్రజలలో శ్రీవెంకటేశ్వరస్వామి పై భక్తీప్రపత్తులు నానాటికీ పెరుగుతున్నాయి.
ఆధ్యాత్మ సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు అన్న రెండు విభాగాలతో లభించిన ఈ సంకీర్తన రాశిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు గాయకుల ద్వారా, ఆడియో కేసెట్లు, సి డి ల ద్వారా ప్రజాసామాన్యంలోకి తేవడానికి చేసిన కృషి ఫలప్రదమవుతున్నది. అన్నమయ్య పాటలలోని ఆధ్యాత్మిక తత్త్వం వేదాంత విద్యాలో నిష్ణాతులైన విద్వాంసులు వివరిస్తే గానీ సామాన్యులకు బోధపడదు. అలా వివరించడానికి కృషి చేసిన పండితుల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి.
వేదార్థాలను సంకీర్తనలుగా పాడి పండితులనే కాక పామరులను గూడా పరవశింపజేసినా మహానుభావుడు తాళ్ళపాక అన్నమయ్య. జీవిత పరమార్థాన్ని తాను చవిచూచి ఇతరులకు కూడా దాని రుచి అందించాలన్న దృష్టితో ఆయన వేలకొలది పదాల ద్వారా భాగవత్తత్త్వాన్ని ప్రచారం చేశాడు. సంగీత సాహిత్యాల పెన్నిధిగా పేరొందిన అన్నమయ్య సారస్వతం నేడు అనన్యసామాన్యమైన ప్రచారం పొందడం ముదావహం. తద్వారా ప్రజలలో శ్రీవెంకటేశ్వరస్వామి పై భక్తీప్రపత్తులు నానాటికీ పెరుగుతున్నాయి. ఆధ్యాత్మ సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు అన్న రెండు విభాగాలతో లభించిన ఈ సంకీర్తన రాశిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు గాయకుల ద్వారా, ఆడియో కేసెట్లు, సి డి ల ద్వారా ప్రజాసామాన్యంలోకి తేవడానికి చేసిన కృషి ఫలప్రదమవుతున్నది. అన్నమయ్య పాటలలోని ఆధ్యాత్మిక తత్త్వం వేదాంత విద్యాలో నిష్ణాతులైన విద్వాంసులు వివరిస్తే గానీ సామాన్యులకు బోధపడదు. అలా వివరించడానికి కృషి చేసిన పండితుల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి.© 2017,www.logili.com All Rights Reserved.