శ్రీనివాస్ నీవు ఎంచుకున్న విషయం గొప్పది, దీని పరిధి మాత్రం విస్తృతం, సమాచారం కూడా పరిమితం. బుద్ధభానుడు ఆయన గారిసతీమణి సాధ్వి యశోధరపై నాటకం అనేది మంచి ప్రయత్నం. నాటకం నాటి గ్రామీణ సమాజాన్ని కడు ప్రభావితం చేసిన తీరు అంతా ఇంతా కాదు. తెలంగాణ ఉద్యమంలో నాటక సమాజాల పాత్ర ఎంతో ఉంది.
రామాయణ భారత కావ్యాల నుంచి ఆధునిక కాలం వరకు వెలువడ్డ దార్శనిక సాహిత్య అధ్యయనం నీకఉపకరించగలదు. బౌద్ధంలోకూడాచాలాఉంది.బాగాదువాలి,పరిశ్రమచేయాలి.నామట్టుకుచెప్పాలంటేనేనుసృష్టించినసాహిత్యంఎంతఅంటే85పుస్తకాలు,17 వేల ప్రింటెడ్పేజెస్అంటేనాచేత్తోని34 వేలపేజీలురాశాను.ఇంతఎందుకుఅంటేజనానికిఅందించాలని అంతేకాని ఇందువల్ల కీర్తిరావాలనిగానీ,డబ్బు రావాలనిగానీ ఎన్నడు అనుకోలేదు. ఇది మన కర్తవ్యంగా భావించి మన కున్న శక్తి మేరకు మనం చేశాం.
ఇప్పుడుఆరోగ్యరిత్యానేనురచనలుచేయలేకపోతున్నాను.రాయడంచాతకాకుండవున్నది.రాయాలనుకున్నారాసినదానికంటే గొప్పదేమి రాయలేను.
ఎందుకంటే నేనుమూటకట్టుకున్నదంతా అయిపోయింది గదా-మళ్ళీ మూటగట్టల్లేను. నా జీవనయానం చదివే ఉంటావు. బౌద్ధ క్షేత్రాలు సందర్శించగలవు. సబ్జెక్ట్ ఇంప్రూవ్ అగుతది. నీవు గతంలో హిస్టరీ లెక్చరర్ కదా.
© 2017,www.logili.com All Rights Reserved.