చంపూ భారతమును రచించిన మహాకవి యనంతభట్టు. ఈ కవిని గూర్చి మన కేమియుఁ దెలియవచ్చుట లేదు.
- శ్లో|| దిగంతరలుఠత్కీర్తి రనంతకవి కుంజరః |
ప్రాణె స్తుల్యం సరస్వత్యాః ప్రాణేషీ చ్చంపు భారతమ్ ||
అను గ్రంథాంత శ్లోకమును బట్టి కవి పేరు మాత్రమే తెలియుచున్నది.
శ్రీ మాడభూషి కృష్ణమాచార్యులు (హెచ్.సి.ఎస్.ఎల్ - 511) - అనంత భట్టు భాగవత చంపువును రచించిన యభినవ కాళిదాసుతో స్పర్థ వహించి తాను గూడ భాగవత చంపును రచించె ననియు నీకవికాలము 11వ శతాబ్ద మనియుఁ జెప్పుచున్నారు. అనంతభట్టు రచించిన భాగవత చంపువు నేఁడు, లభించుట లేదు. అభినవ కాళిదాస బిరుదాంకితుఁడగు వెల్లాలకవి 16వ శతాబ్దమునకుఁ జెందినవాఁడు. అనంతభట్ట - అభినవ కాళిదాసుల సమకాలికత్వము కూడ సందిగ్ధమే కావునఁ జంపూభాగవతకర్త కాలము నిదమిత్థముగా నిర్ణయించుటకు వీలులేకున్నది. మాడభూషివారు చెప్పినట్లు 16-17 శతాబ్దములకు (జెందిన నారాయణ భట్టాత్రి - మానదేవుఁడు భారత చంపువును బేర్కొనుటచే ననంతభట్టు 16వ శతాబ్దికిఁ బూర్వుఁ డని మాత్రము చెప్పఁగలము.
అనంత భట్టు తెలుఁగు వాఁడు.
అనంత భట్టు మన తెలుఁగు వాఁడని చెప్పుటకుఁ గొన్ని సూచనలు చంపూ భారతమునందే కలవు.
చంపూ భారతమును రచించిన మహాకవి యనంతభట్టు. ఈ కవిని గూర్చి మన కేమియుఁ దెలియవచ్చుట లేదు.- శ్లో|| దిగంతరలుఠత్కీర్తి రనంతకవి కుంజరః | ప్రాణె స్తుల్యం సరస్వత్యాః ప్రాణేషీ చ్చంపు భారతమ్ ||అను గ్రంథాంత శ్లోకమును బట్టి కవి పేరు మాత్రమే తెలియుచున్నది. శ్రీ మాడభూషి కృష్ణమాచార్యులు (హెచ్.సి.ఎస్.ఎల్ - 511) - అనంత భట్టు భాగవత చంపువును రచించిన యభినవ కాళిదాసుతో స్పర్థ వహించి తాను గూడ భాగవత చంపును రచించె ననియు నీకవికాలము 11వ శతాబ్ద మనియుఁ జెప్పుచున్నారు. అనంతభట్టు రచించిన భాగవత చంపువు నేఁడు, లభించుట లేదు. అభినవ కాళిదాస బిరుదాంకితుఁడగు వెల్లాలకవి 16వ శతాబ్దమునకుఁ జెందినవాఁడు. అనంతభట్ట - అభినవ కాళిదాసుల సమకాలికత్వము కూడ సందిగ్ధమే కావునఁ జంపూభాగవతకర్త కాలము నిదమిత్థముగా నిర్ణయించుటకు వీలులేకున్నది. మాడభూషివారు చెప్పినట్లు 16-17 శతాబ్దములకు (జెందిన నారాయణ భట్టాత్రి - మానదేవుఁడు భారత చంపువును బేర్కొనుటచే ననంతభట్టు 16వ శతాబ్దికిఁ బూర్వుఁ డని మాత్రము చెప్పఁగలము. అనంత భట్టు తెలుఁగు వాఁడు. అనంత భట్టు మన తెలుఁగు వాఁడని చెప్పుటకుఁ గొన్ని సూచనలు చంపూ భారతమునందే కలవు.© 2017,www.logili.com All Rights Reserved.