భారతదేశం కర్మభూమి, వేదభూమి, ధర్మభూమి. విశ్వమే రూపంగా గల విష్ణువు ఈ పుణ్యభూమిలోనే ఎన్నో అవతారాల్లో అవతరించి దుష్టుల్ని శిక్షించి, ధర్మాత్ముల్ని రక్షించాడు. దైవ సంకల్పంతో ఎందరో మునులు, యోగులు, పండితులు, వేదాంతులు అపార నిష్ఠాతపొగరిష్టులు, భాగవతులు, మేధావులు తమ రచనలద్వారా దైవం గురించి మనకు ఎన్నో విషయాల్ని వివరించారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు భగవంతుని గుణగణలీలా విశేషాల్ని చాటుతున్నాయి.
మూల గ్రందాల సారాన్ని గ్రహించి ఈ పుస్తకంలో పొండుపరచానే గానీ నా స్వంత ప్రతిభ ఇందులో ఏమిలేదు. కుటుంబసభ్యులు నాకెంతో ప్రోత్సాహం ఇచ్చి రచనలో లీనమయ్యే పరిస్థితిని కల్పించారు. ఈ పుస్తకం మీ ముందు ఉందంటే దానికి కారణం దైవసంకల్పం. శ్రద్ధగా ఓర్పుతో పుస్తకాన్ని మీ ముందుకు తెచ్చాము. భగవంతునికి సర్వదా కృతజ్ఞురాల్ని. అలాగే దైవానుగ్రహంతో నేను దర్శించిన ఆలయ విశేషాలన్నీ వివరించగలిగాను. ఈ పుస్తకంలో ఏమైనా దోషాలుంటే అవి నావి, ఈ పుస్తకం మీకు నచ్చిందంటే అది దేవదేవుని కృప అని భావిస్తూ...!
- మల్లాది రామలక్ష్మి
భారతదేశం కర్మభూమి, వేదభూమి, ధర్మభూమి. విశ్వమే రూపంగా గల విష్ణువు ఈ పుణ్యభూమిలోనే ఎన్నో అవతారాల్లో అవతరించి దుష్టుల్ని శిక్షించి, ధర్మాత్ముల్ని రక్షించాడు. దైవ సంకల్పంతో ఎందరో మునులు, యోగులు, పండితులు, వేదాంతులు అపార నిష్ఠాతపొగరిష్టులు, భాగవతులు, మేధావులు తమ రచనలద్వారా దైవం గురించి మనకు ఎన్నో విషయాల్ని వివరించారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు భగవంతుని గుణగణలీలా విశేషాల్ని చాటుతున్నాయి. మూల గ్రందాల సారాన్ని గ్రహించి ఈ పుస్తకంలో పొండుపరచానే గానీ నా స్వంత ప్రతిభ ఇందులో ఏమిలేదు. కుటుంబసభ్యులు నాకెంతో ప్రోత్సాహం ఇచ్చి రచనలో లీనమయ్యే పరిస్థితిని కల్పించారు. ఈ పుస్తకం మీ ముందు ఉందంటే దానికి కారణం దైవసంకల్పం. శ్రద్ధగా ఓర్పుతో పుస్తకాన్ని మీ ముందుకు తెచ్చాము. భగవంతునికి సర్వదా కృతజ్ఞురాల్ని. అలాగే దైవానుగ్రహంతో నేను దర్శించిన ఆలయ విశేషాలన్నీ వివరించగలిగాను. ఈ పుస్తకంలో ఏమైనా దోషాలుంటే అవి నావి, ఈ పుస్తకం మీకు నచ్చిందంటే అది దేవదేవుని కృప అని భావిస్తూ...! - మల్లాది రామలక్ష్మి© 2017,www.logili.com All Rights Reserved.