మనసు మరుగున తారాడు మెలకువలను వెలువరించుటకు మాటలే కాక మరి ఎన్నో మార్గములున్నవి. వాటిలో ఒకటి పండుగలు. ప్రజల మనోవికారములు. జిజ్ఞాసా విలసితములు, ఋతు పరివర్తనమువలన ప్రకృతిలో నేర్పడు వివిధ పరిణామములు, పరంపరాగతములగు పూర్వగాథలు, నభోమండలమున నగపడు నక్షత్రగ్రహాది సన్నివేశములు, తమ పర్యవేక్షణ ఫలములన్నియు నిత్య జీవితమున మేళవింపజేసి, వానికి నిత్యత్వము సంతరింప జేయవలెనను అభిలాష మొదలగున వెన్నియో జున్నుకట్టగా రూపొందినవి పండుగలు. వానిలో కొన్నింటిని ఈ చిన్న పుస్తకములో చర్చించితిని. సహృదయ పరిశోధకుల హృదయమే ప్రమాణము.
ఈ రచనలో పెక్కు విషయములను నాకు అతి సుభోధముగా సమన్వయపరచి చెప్పిన మా అమ్మగారు మూర్తీభవించిన ప్రాచీన సంస్కృతి శ్రీమతి జానకమ్మగారికి నేను మిగుల ఋణపడియున్నాను. జన్మసిద్ధమగు మాతృ ఋణమొకటి యుండనే యున్నది.
- తిరుమల రామచంద్ర
మనసు మరుగున తారాడు మెలకువలను వెలువరించుటకు మాటలే కాక మరి ఎన్నో మార్గములున్నవి. వాటిలో ఒకటి పండుగలు. ప్రజల మనోవికారములు. జిజ్ఞాసా విలసితములు, ఋతు పరివర్తనమువలన ప్రకృతిలో నేర్పడు వివిధ పరిణామములు, పరంపరాగతములగు పూర్వగాథలు, నభోమండలమున నగపడు నక్షత్రగ్రహాది సన్నివేశములు, తమ పర్యవేక్షణ ఫలములన్నియు నిత్య జీవితమున మేళవింపజేసి, వానికి నిత్యత్వము సంతరింప జేయవలెనను అభిలాష మొదలగున వెన్నియో జున్నుకట్టగా రూపొందినవి పండుగలు. వానిలో కొన్నింటిని ఈ చిన్న పుస్తకములో చర్చించితిని. సహృదయ పరిశోధకుల హృదయమే ప్రమాణము. ఈ రచనలో పెక్కు విషయములను నాకు అతి సుభోధముగా సమన్వయపరచి చెప్పిన మా అమ్మగారు మూర్తీభవించిన ప్రాచీన సంస్కృతి శ్రీమతి జానకమ్మగారికి నేను మిగుల ఋణపడియున్నాను. జన్మసిద్ధమగు మాతృ ఋణమొకటి యుండనే యున్నది. - తిరుమల రామచంద్ర© 2017,www.logili.com All Rights Reserved.