'నుడి - నానుడి' అనే ఈ గ్రంథంలో శ్రీ తిరుమల రామచంద్రగారు ఎన్నో తెలుగు మాటల వ్యుత్పత్తులు సులభగ్రాహ్యమైన శైలిలో చర్చించారు. ఈ వ్యాసాల్లో శ్రీ రామచంద్ర గారికి సంస్కృతాంధ్ర భాషల్లో ఉన్న పాండిత్యమే గాక, ఇతర భాషల్లో వారికున్న చొరవ, పరిశోధనాత్మకబుద్ధి వ్యక్తమౌతాయి. శాస్త్ర విషయాలను అందరికీ ఆప్యాయంగా ఉండే రీతిన చెప్పటం వీరి ప్రత్యేకశక్తి. మాటల పుట్టుకలు పోల్చి సమన్వయించటంలో ఎన్నో సాంఘిక, సాంస్కృతిక, విజ్ఞాన విశేషాలు పాఠకులకు అందించారు. చాలా మాటలకు వీరు కల్పించిన వ్యుత్పత్తులు శాస్త్ర చర్చకు నిలబడతాయి. కొన్ని నిలబడకపోయినా, శబ్దోత్పత్తి విజ్ఞానాభిలాష పాఠకుల్లో కలిగించటంలో వీరి ప్రయత్నం కృతార్థమైందనే నేను భావిస్తున్నాను.
- భద్రిరాజు కృష్ణమూర్తి
'నుడి - నానుడి' అనే ఈ గ్రంథంలో శ్రీ తిరుమల రామచంద్రగారు ఎన్నో తెలుగు మాటల వ్యుత్పత్తులు సులభగ్రాహ్యమైన శైలిలో చర్చించారు. ఈ వ్యాసాల్లో శ్రీ రామచంద్ర గారికి సంస్కృతాంధ్ర భాషల్లో ఉన్న పాండిత్యమే గాక, ఇతర భాషల్లో వారికున్న చొరవ, పరిశోధనాత్మకబుద్ధి వ్యక్తమౌతాయి. శాస్త్ర విషయాలను అందరికీ ఆప్యాయంగా ఉండే రీతిన చెప్పటం వీరి ప్రత్యేకశక్తి. మాటల పుట్టుకలు పోల్చి సమన్వయించటంలో ఎన్నో సాంఘిక, సాంస్కృతిక, విజ్ఞాన విశేషాలు పాఠకులకు అందించారు. చాలా మాటలకు వీరు కల్పించిన వ్యుత్పత్తులు శాస్త్ర చర్చకు నిలబడతాయి. కొన్ని నిలబడకపోయినా, శబ్దోత్పత్తి విజ్ఞానాభిలాష పాఠకుల్లో కలిగించటంలో వీరి ప్రయత్నం కృతార్థమైందనే నేను భావిస్తున్నాను. - భద్రిరాజు కృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.