ప్రసిద్ధి చెందిన మహాభారత' మహాగ్రంథం కాలక్రమంలో బహుళ జనాదరణవలన, వక్తల కవుల ఊహా ప్రతిభవల్లబహుకల్పనలకు, చిలవలు పలవల పిట్టకథలకు లోనై అసలు కథ తెలియని పరిస్థితి ఏర్పడింది. భారతంలో రపక్షాలున్నట్లే - లోకంలోకూడా ఉంటాయి. అధర్మపక్షాన్ని సమర్థించే కుహనా మేధావులు విజృంభించి కువ్యాఖ్యలతో, అధ్యయనరాహిత్యంతో వ్రాసిన రచనలు,తీసిన చిత్రాలు, నాటకాలు - కలి వైపరీత్యం వల్ల జనులలో చొచ్చుకుపోయాయి.
కొందరు పండితుల సైతంపొరపడినసందర్భాలుఉన్నాయి.వాటిని ఖండిస్తూ అసలుభారతకథనివ్రాసిన విద్వాంసులూఉన్నారు.కానీ వాటిని పెద్దగా ప్రోత్సహించి ,ప్రచారం చేసిన వారసంఖ్య తక్కువే.
ఈనేపథ్యంలో మూలభారతాన్ని ప్రమాణంగా తీసుకొని, గురువుల అనుగ్రహంతో, శ్రీకృష్ణ కారుణ్యంతో అధ్యయనంచేసి, అవగతం చేసుకున్న అంశాలను ప్రవచించాక - దూరదర్శన మాధ్యమంలో ప్రసారమయ్యాక - వాటన్నిటినీ పుస్తకంగా తీసుకురావాలనే ఎందరో సహృదయుల అభిలాష ఇప్పుడు ఋషిపీఠం ద్వారా నెరవేరింది.
మహాభారతంపై పద్దెనిమిది రోజులు చేసిన ప్రవచనానికి పుస్తకరూపమిది. ప్రధానమైన ఆఖ్యానాన్ని మూలగ్రంథమైనవ్యాసభారతం ఆధారంగా ఆవిష్కరించిన ఆ ప్రవచన వాహినిని రోజూ వచ్చి శ్రద్ధగా విన్న ప్రసిద్ధ పాత్రికేయులు శ్రీగుండు వల్లీశ్వరిగారు,కార్యక్రమ అనంతరం విడుదలైన ధ్వనిముద్రికలను కూడా విని ఈ పుస్తక రూపాన్ని సంతరించారు.
ఋషిపీఠానికి, నాకూ, శ్రీ వల్లీశ్వర్ గారికీ కూడా ఎంతో ఆత్మీయులు శ్రీ దివాకరుని పున్నయ్య శర్మగారు.వీరిద్వారా - ఏలూరులోని శ్రీ దివాకరుని వేంకటరమణారావు ఫౌండేషన్ నిర్వహణలో రెండు దశాబ్దాలుగా ప్రతి ఏడాదీవివిధ విషయాలపైప్రవచనాలివ్వడం జరుగుతోంది.
హేలాపురిలో శ్రీ దివాకరుని వేంకటరమణారావు గారు ఎన్నో సత్కార్యాలను నిర్వహించిన మహానుభావులు. సనాతన ధర్మాన్నీ, ఆర్ష సంస్కృతినీ, సంప్రదాయాలను తాను గ్రహించి పాటించడమేకాక, వాటి పరిరక్షణకు, పరీవ్యాప్తికి ఎంతోకృషి చేశారు.కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ చన్రశేఖరేన్ద సరస్వతీ మహాస్వామి వారి కరుణకు పాత్రులై, వారిని ప్రత్యక్షంగా సేవించుకున్నారు.వారి ఏలూరు పర్యటనలో ప్రధాన నిర్వాహకులయ్యారు.
ప్రసిద్ధి చెందిన మహాభారత' మహాగ్రంథం కాలక్రమంలో బహుళ జనాదరణవలన, వక్తల కవుల ఊహా ప్రతిభవల్లబహుకల్పనలకు, చిలవలు పలవల పిట్టకథలకు లోనై అసలు కథ తెలియని పరిస్థితి ఏర్పడింది. భారతంలో రపక్షాలున్నట్లే - లోకంలోకూడా ఉంటాయి. అధర్మపక్షాన్ని సమర్థించే కుహనా మేధావులు విజృంభించి కువ్యాఖ్యలతో, అధ్యయనరాహిత్యంతో వ్రాసిన రచనలు,తీసిన చిత్రాలు, నాటకాలు - కలి వైపరీత్యం వల్ల జనులలో చొచ్చుకుపోయాయి. కొందరు పండితుల సైతంపొరపడినసందర్భాలుఉన్నాయి.వాటిని ఖండిస్తూ అసలుభారతకథనివ్రాసిన విద్వాంసులూఉన్నారు.కానీ వాటిని పెద్దగా ప్రోత్సహించి ,ప్రచారం చేసిన వారసంఖ్య తక్కువే. ఈనేపథ్యంలో మూలభారతాన్ని ప్రమాణంగా తీసుకొని, గురువుల అనుగ్రహంతో, శ్రీకృష్ణ కారుణ్యంతో అధ్యయనంచేసి, అవగతం చేసుకున్న అంశాలను ప్రవచించాక - దూరదర్శన మాధ్యమంలో ప్రసారమయ్యాక - వాటన్నిటినీ పుస్తకంగా తీసుకురావాలనే ఎందరో సహృదయుల అభిలాష ఇప్పుడు ఋషిపీఠం ద్వారా నెరవేరింది. మహాభారతంపై పద్దెనిమిది రోజులు చేసిన ప్రవచనానికి పుస్తకరూపమిది. ప్రధానమైన ఆఖ్యానాన్ని మూలగ్రంథమైనవ్యాసభారతం ఆధారంగా ఆవిష్కరించిన ఆ ప్రవచన వాహినిని రోజూ వచ్చి శ్రద్ధగా విన్న ప్రసిద్ధ పాత్రికేయులు శ్రీగుండు వల్లీశ్వరిగారు,కార్యక్రమ అనంతరం విడుదలైన ధ్వనిముద్రికలను కూడా విని ఈ పుస్తక రూపాన్ని సంతరించారు. ఋషిపీఠానికి, నాకూ, శ్రీ వల్లీశ్వర్ గారికీ కూడా ఎంతో ఆత్మీయులు శ్రీ దివాకరుని పున్నయ్య శర్మగారు.వీరిద్వారా - ఏలూరులోని శ్రీ దివాకరుని వేంకటరమణారావు ఫౌండేషన్ నిర్వహణలో రెండు దశాబ్దాలుగా ప్రతి ఏడాదీవివిధ విషయాలపైప్రవచనాలివ్వడం జరుగుతోంది. హేలాపురిలో శ్రీ దివాకరుని వేంకటరమణారావు గారు ఎన్నో సత్కార్యాలను నిర్వహించిన మహానుభావులు. సనాతన ధర్మాన్నీ, ఆర్ష సంస్కృతినీ, సంప్రదాయాలను తాను గ్రహించి పాటించడమేకాక, వాటి పరిరక్షణకు, పరీవ్యాప్తికి ఎంతోకృషి చేశారు.కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ చన్రశేఖరేన్ద సరస్వతీ మహాస్వామి వారి కరుణకు పాత్రులై, వారిని ప్రత్యక్షంగా సేవించుకున్నారు.వారి ఏలూరు పర్యటనలో ప్రధాన నిర్వాహకులయ్యారు.
© 2017,www.logili.com All Rights Reserved.