భారతావనియందు జన్మించిన ప్రతి మానవుని నోట తిరుగునామము రామనామము. రాముడు ఘోర పాతక విరాముడు. సీతమ్మ జగన్మాత. రామ నామం తారక నామం. సంసారం సాగరం నుంచి అందరిని గట్టెక్కించే గట్టి మంత్రము. సీతారాముల నామస్మరణే మహర్షులకు, మునిపుంగవులకు, మన తాతలకు, గాంధీలనాటి రాజకీయ నాయకులకు శరణమైంది. కలిసంతరణోపనిషత్తు కలి బాధల నుండి విముక్తికి రామనామ స్మరణే ఉపాయమనిపించింది.
రామాయణం సీతాదేవి చరిత్ర. 'సీతాయాః చరితం మహాత్' అని వాల్మీకి రామాయణానికి పేరు పెట్టారు. పితామహుని అనుగ్రహం వల్ల పూసగుచ్చినట్లు రాముని కథను తెలుసుకొని మానవాళికి సమర్పించిన ఘనత వాల్మీకి చిక్కింది. అతనే ఆదికవి. వైదిక ఛందస్సు భూలోకానికి తెచ్చిన ఘనత అతనిదే. శ్రీమద్రామాయణాన్ని అనుభవించి రచించి సంస్కృత వాజ్మయానికి గొప్ప సేవ చేయడమేకాక మొట్టమొదట రామకథను లవకుశులకు ఉపదేశించి ప్రచారపరిచిందీ ఆ మునిపుంగవుడగు వాల్మీకియే.
భారతావనియందు జన్మించిన ప్రతి మానవుని నోట తిరుగునామము రామనామము. రాముడు ఘోర పాతక విరాముడు. సీతమ్మ జగన్మాత. రామ నామం తారక నామం. సంసారం సాగరం నుంచి అందరిని గట్టెక్కించే గట్టి మంత్రము. సీతారాముల నామస్మరణే మహర్షులకు, మునిపుంగవులకు, మన తాతలకు, గాంధీలనాటి రాజకీయ నాయకులకు శరణమైంది. కలిసంతరణోపనిషత్తు కలి బాధల నుండి విముక్తికి రామనామ స్మరణే ఉపాయమనిపించింది. రామాయణం సీతాదేవి చరిత్ర. 'సీతాయాః చరితం మహాత్' అని వాల్మీకి రామాయణానికి పేరు పెట్టారు. పితామహుని అనుగ్రహం వల్ల పూసగుచ్చినట్లు రాముని కథను తెలుసుకొని మానవాళికి సమర్పించిన ఘనత వాల్మీకి చిక్కింది. అతనే ఆదికవి. వైదిక ఛందస్సు భూలోకానికి తెచ్చిన ఘనత అతనిదే. శ్రీమద్రామాయణాన్ని అనుభవించి రచించి సంస్కృత వాజ్మయానికి గొప్ప సేవ చేయడమేకాక మొట్టమొదట రామకథను లవకుశులకు ఉపదేశించి ప్రచారపరిచిందీ ఆ మునిపుంగవుడగు వాల్మీకియే.
© 2017,www.logili.com All Rights Reserved.