వచనోపక్రమం
కన్నడ వాఙ్మయంలో వచన సాహిత్యం చాలా విలక్షణమైంది, విశిష్టమైంది. ఈ వచన సాహిత్యాన్నే శరణ సాహిత్యం అనికూడా అంటారు. శరణులు అంటే వీరశైవ మతానికి చెందిన శివభక్తులు. వీరు సృష్టించిన సాహిత్యం గాబట్టి ఇది శరణ సాహిత్యం. భక్తిపారవశ్యంతో వారి నోటి నుండి వెలువడ్డ అనుభవ వాక్కులే వచనరూపం దాల్చినయ్యి. అందువల్ల ఈ వచనాలను అనుభవ సాహిత్యం అనికూడా పిలుస్తారు. ఈ వచనాలు వేటికవి స్వతంత్రంగా వుంటవి. పూర్వం నుండి సంప్రదాయాలుగా వస్తున్న ఛందస్సు వీటిల్లో లేదు. ఒకవిధమైన లయ అంతస్సూత్రంగా వుంటుంది. ఆ లయ ఆ పదాల కూర్పువల్ల వస్తుంది. ఆ కూర్పు ఆ రసానికి తగ్గట్టు సహజంగా ఏర్పడుతుంది. కన్నడ భాషకు దాదాపు పదిహేను వందల సంవత్సరాల సాహిత్య చరిత్ర వుంది. దక్షిణాది భాషల్లో తమిళం తర్వాత కన్నడానికే ఇంత పురాతనమైన సాహిత్య చరిత్రవుంది. ఆ భాషలో వచనాల కొచ్చినంత పేరు, ప్రఖ్యాతి మరి ఏ ఇతర సాహిత్య ప్రక్రియకు రాలేదు. వచన సాహిత్యం కన్నడులు కూడబెట్టుకొన్న ప్రత్యేకమైన చెరగని గొప్ప ఆస్తి. దీన్ని మొదటగా తవ్వి తలకెత్తినవారు శరణులే. వీరు ఎక్కువగా 11, 12 శతాబ్దులకు చెందినట్టివారు.
అప్పటి శివభక్తుల్లో బసవన్న, అల్లమప్రభు, అక్కమహాదేవి, దేవర దాసిమయ్య, మడివాలు మాచయ్య, సిద్ధరామయ్య, చెన్న బసవన్న మొదలైన వారు ముఖ్యులైతే, ఆ ముఖ్యుల్లో కూడా ముఖ్యుడు బసవన్న. అతడు వీరందరికీ తలలో నాలుక, పూసల్లో దారంలా వుండేవాడు. వీరందరూ తమ తమ ఇష్టదైవాల పేర్లను మకుటాలుగా చివర జేర్చుకొని వచనాలు అల్లుకొన్నారు. బసవన్న 'కూడల సంగమదేవా' అనే మకుటంతో,..........................
వచనోపక్రమం కన్నడ వాఙ్మయంలో వచన సాహిత్యం చాలా విలక్షణమైంది, విశిష్టమైంది. ఈ వచన సాహిత్యాన్నే శరణ సాహిత్యం అనికూడా అంటారు. శరణులు అంటే వీరశైవ మతానికి చెందిన శివభక్తులు. వీరు సృష్టించిన సాహిత్యం గాబట్టి ఇది శరణ సాహిత్యం. భక్తిపారవశ్యంతో వారి నోటి నుండి వెలువడ్డ అనుభవ వాక్కులే వచనరూపం దాల్చినయ్యి. అందువల్ల ఈ వచనాలను అనుభవ సాహిత్యం అనికూడా పిలుస్తారు. ఈ వచనాలు వేటికవి స్వతంత్రంగా వుంటవి. పూర్వం నుండి సంప్రదాయాలుగా వస్తున్న ఛందస్సు వీటిల్లో లేదు. ఒకవిధమైన లయ అంతస్సూత్రంగా వుంటుంది. ఆ లయ ఆ పదాల కూర్పువల్ల వస్తుంది. ఆ కూర్పు ఆ రసానికి తగ్గట్టు సహజంగా ఏర్పడుతుంది. కన్నడ భాషకు దాదాపు పదిహేను వందల సంవత్సరాల సాహిత్య చరిత్ర వుంది. దక్షిణాది భాషల్లో తమిళం తర్వాత కన్నడానికే ఇంత పురాతనమైన సాహిత్య చరిత్రవుంది. ఆ భాషలో వచనాల కొచ్చినంత పేరు, ప్రఖ్యాతి మరి ఏ ఇతర సాహిత్య ప్రక్రియకు రాలేదు. వచన సాహిత్యం కన్నడులు కూడబెట్టుకొన్న ప్రత్యేకమైన చెరగని గొప్ప ఆస్తి. దీన్ని మొదటగా తవ్వి తలకెత్తినవారు శరణులే. వీరు ఎక్కువగా 11, 12 శతాబ్దులకు చెందినట్టివారు. అప్పటి శివభక్తుల్లో బసవన్న, అల్లమప్రభు, అక్కమహాదేవి, దేవర దాసిమయ్య, మడివాలు మాచయ్య, సిద్ధరామయ్య, చెన్న బసవన్న మొదలైన వారు ముఖ్యులైతే, ఆ ముఖ్యుల్లో కూడా ముఖ్యుడు బసవన్న. అతడు వీరందరికీ తలలో నాలుక, పూసల్లో దారంలా వుండేవాడు. వీరందరూ తమ తమ ఇష్టదైవాల పేర్లను మకుటాలుగా చివర జేర్చుకొని వచనాలు అల్లుకొన్నారు. బసవన్న 'కూడల సంగమదేవా' అనే మకుటంతో,..........................© 2017,www.logili.com All Rights Reserved.