వాల్మీకి రామాయణము
బాల కాండ
పవిత్రమైన వాల్మీకిమహర్షి ఆశ్రమానికి ఒకరోజు దేవర్షి నారదుడు వచ్చాడు.
తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్,
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్.
వచ్చిన నారదుడు తపస్స్వాధ్యాయనిరతుడు. ' వాగ్విదాంవరుడు. * మునిపుంగవుడు. '
ఆహ్వానించి పూజించిన వాల్మీకి తపస్వి.
వాల్మీకి నారదుడిని ఇలా పరిప్రశ్నించాడు.
ఈ ప్రశ్నతోనే రామాయణమహాకావ్యం ప్రారంభం అవుతుంది.
"మహర్షీ! ఇప్పుడు, ఈ లోకంలో ఎవడైనా మానవుడు
ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవంతుడు, దృఢవ్రతుడు, సచ్చరిత్రుడు,
సర్వప్రాణికోటికీ హితుడు, విద్వాంసుడు, సమర్థుడు, సదా ప్రియదర్శనుడు,
ఆపైన ధైర్యవంతుడు, తేజోవంతుడు, జితక్రోధుడు, అసూయలేనివాడు,
కోపించి రణరంగంలో నిలిస్తే దేవతలకు కూడా భయం కలిగించేవాడు - ఉన్నాడా?
మీరు సకలలోకాల సమాచారం తెలుసుకోగల సమర్థులు కదా! అటువంటి మానవుడు ఉంటే మీకు తప్పక తెలుస్తుంది.
© 2017,www.logili.com All Rights Reserved.