ఈ గ్రంథం శ్రీకాశీ విశాలాక్షీవిశ్వేశ్వరుల దివ్యచరణాలకు సమర్పించుకుంటున్న దివ్యకుసుమాంజలి.
పరంపరగా ప్రసిద్ధిచెందిన స్తోత్రాలతో పాటు, వ్యాసమహర్షి ప్రోక్త సనపురాణాంతర్గతమైన 'కాశీఖండం' లోని మహిమాన్వితమైన శ్లోకాలను సేకరించి దీనిలో అందించడం ఒక ప్రత్యేకం.
మూలగ్రంథంలోని సంస్కృతశ్లోకాలతోపాటు శ్రీనాథుని ఆంద్రీకృత కాశీఖండంలోని తెలుగు పద్యాలనుకూడా సముచితంగా జోడించి అందించడం మరో వైశిష్ట్యం.
మూలంలోని 'గంగా సహస్రనామస్తోత్రం' భక్తులకు చక్కని మహెూపయోగకర స్తుతి.మొత్తంగా కాశీవాసులు, కాశీ తీర్థ సేవకులు, కాశీ భక్తులు నిత్యం శ్రద్ధగా చదువుకొని తరించగలిగే విధంగా దీనిని సమకూర్చడం జరిగింది.
ఈ గ్రంథరూపకల్పనలో డిటిపి చేసి సహకరించిన సంస్కృత భాషా విదుషీమణి శ్రీమతి మారేపల్లి శ్రీ హైమవతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
సకాలంలో సవ్యంగా, సుందరంగా, తీర్చిదిద్దడంలో దీక్షగా కృషిచేసిన ఆత్మీయులు శ్రీ మల్లాది వెంకట రామసుబ్రహ్మణ్య ప్రసాదు గారు శ్రీ విశ్వనాథాను గ్రహపాత్రులౌదురు గాక. అని ఈ గ్రంథ ప్రచురణకై సహకరించిన ఋషిపీఠం ఆత్మీయులు, కాశీప్రవచన యజ్ఞ భక్తవరులకు కృతజ్ఞతలు.
-సామవేదం షణ్ముఖశర్మ
ఈ గ్రంథం శ్రీకాశీ విశాలాక్షీవిశ్వేశ్వరుల దివ్యచరణాలకు సమర్పించుకుంటున్న దివ్యకుసుమాంజలి. పరంపరగా ప్రసిద్ధిచెందిన స్తోత్రాలతో పాటు, వ్యాసమహర్షి ప్రోక్త సనపురాణాంతర్గతమైన 'కాశీఖండం' లోని మహిమాన్వితమైన శ్లోకాలను సేకరించి దీనిలో అందించడం ఒక ప్రత్యేకం. మూలగ్రంథంలోని సంస్కృతశ్లోకాలతోపాటు శ్రీనాథుని ఆంద్రీకృత కాశీఖండంలోని తెలుగు పద్యాలనుకూడా సముచితంగా జోడించి అందించడం మరో వైశిష్ట్యం. మూలంలోని 'గంగా సహస్రనామస్తోత్రం' భక్తులకు చక్కని మహెూపయోగకర స్తుతి.మొత్తంగా కాశీవాసులు, కాశీ తీర్థ సేవకులు, కాశీ భక్తులు నిత్యం శ్రద్ధగా చదువుకొని తరించగలిగే విధంగా దీనిని సమకూర్చడం జరిగింది. ఈ గ్రంథరూపకల్పనలో డిటిపి చేసి సహకరించిన సంస్కృత భాషా విదుషీమణి శ్రీమతి మారేపల్లి శ్రీ హైమవతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సకాలంలో సవ్యంగా, సుందరంగా, తీర్చిదిద్దడంలో దీక్షగా కృషిచేసిన ఆత్మీయులు శ్రీ మల్లాది వెంకట రామసుబ్రహ్మణ్య ప్రసాదు గారు శ్రీ విశ్వనాథాను గ్రహపాత్రులౌదురు గాక. అని ఈ గ్రంథ ప్రచురణకై సహకరించిన ఋషిపీఠం ఆత్మీయులు, కాశీప్రవచన యజ్ఞ భక్తవరులకు కృతజ్ఞతలు. -సామవేదం షణ్ముఖశర్మ© 2017,www.logili.com All Rights Reserved.