ఉపనిషత్తులందించే విజ్ఞానం నిత్యనూతనము, నిత్యావసరము. ఉపనిషత్తులు ఊహలు కావు, దర్శనాలు. సత్యాన్ని దర్శించిన మహర్షులు మానవాళికి అందించిన తరగని సంపద, చేసిన మహోపకారము. వేదం కాలంలో కంటే ఈ వేదనల కాలంలో వాటి అవసరం మరింతగా పెరిగింది. మనిషి నిత్యజీవితంలో సుఖశాంతులకై పరుగులు తీసి అవి కరువైనాయి అని విచారిస్తుంటాడు. దేని కొరకు వేటాడుతున్నాడో అది మృగ్యమని, మృగతృష్ణికలోని నీటికోసం దాహంతో పరుగెత్తుతున్నానని తెలుసుకుంటున్నాడు. దాహం తీర్చగలిగినది ఈ ఉపనిషద్గంగ. పరుగు వేగాన్ని తగ్గించక, దిశను మార్చవలె, జ్ఞానగంగవైపుకు.
ఈ ఉపనిషత్తులోని ఉపదేశం ఎంత మహత్త్వం కలదో, కథ సూచించే గురుశిష్య సంబంధం అంత మహత్త్వం కల విషయం. ఈ శ్రద్ధా మహాత్త్వాన్ని ఉపోద్ఘాతంలో వివరించే ప్రయత్నం చేశాను.
ఉపనిషత్తులందించే విజ్ఞానం నిత్యనూతనము, నిత్యావసరము. ఉపనిషత్తులు ఊహలు కావు, దర్శనాలు. సత్యాన్ని దర్శించిన మహర్షులు మానవాళికి అందించిన తరగని సంపద, చేసిన మహోపకారము. వేదం కాలంలో కంటే ఈ వేదనల కాలంలో వాటి అవసరం మరింతగా పెరిగింది. మనిషి నిత్యజీవితంలో సుఖశాంతులకై పరుగులు తీసి అవి కరువైనాయి అని విచారిస్తుంటాడు. దేని కొరకు వేటాడుతున్నాడో అది మృగ్యమని, మృగతృష్ణికలోని నీటికోసం దాహంతో పరుగెత్తుతున్నానని తెలుసుకుంటున్నాడు. దాహం తీర్చగలిగినది ఈ ఉపనిషద్గంగ. పరుగు వేగాన్ని తగ్గించక, దిశను మార్చవలె, జ్ఞానగంగవైపుకు. ఈ ఉపనిషత్తులోని ఉపదేశం ఎంత మహత్త్వం కలదో, కథ సూచించే గురుశిష్య సంబంధం అంత మహత్త్వం కల విషయం. ఈ శ్రద్ధా మహాత్త్వాన్ని ఉపోద్ఘాతంలో వివరించే ప్రయత్నం చేశాను.© 2017,www.logili.com All Rights Reserved.