ఇది 1996 మే 15 నుండి జూన్ 5 వరకు 22 రోజుల పాటు జరిగిన సాహితీ సాహస విన్యాసం. అందునా రెండవ ముద్రణ. అప్పటికీ ఇప్పటికీ నాలోను, నా పద్యంలోనూ చాలా మార్పులున్నాయి. కాబట్టి 18 సంవత్సరాల వెనుకటి అవధాన పద్యాలు చదువుతున్నామనే భావనతో ఈ అవధాన సాహిత్య పరిశీలన చేయవలసిందిగా మొదటి మనవి.
ఆ కాలంలో రాజకీయ వాతావరణం ఇప్పటికి పూర్తిగా భిన్నం. పి. వి. నరసింహారావు గారి ప్రభుత్వం అనంతరం జరిగిన ఎన్నికలు - ఎవరికీ ఆధిక్యం రాకపోవడం, దేవెగౌడ నాయకత్వంలో కలగూరగంప ప్రభుత్వం ఏర్పడటం, అది కూలిపోతుందనే ఊహాగానాలు, ఇదీ నాటి రాజకీయ పరిస్థితి. రాజకీయ సంబంధమైన పద్యాలు చదివేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవలసిందిగా రెండో మనవి.
- డా. గరికిపాటి నరసింహారావు