రామాయణం తర్వాత ప్రపంచ సాహిత్యంలోనే ప్రాచీనమైన మహేతిహాసం వ్యాస మహాభారతం. ఈ ఇతిహాసంలో మన ఊహకు అందే
మానవ సహజమైన ప్రతి భావోద్వేగమూ – ప్రేమ, అసహ్యం, ఈర్ష్య, అసూయ, ప్రతీకారం, ద్రోహం, వాత్సల్యం, క్షమ – వర్ణితమయ్యాయి.
వ్యాసుని ప్రతిభలో గణనీయమైన లక్షణం ఆయా పాత్రల చిత్రణలో ఆయన చూపించిన నిజాయితీ, సాహసం. అదెంత గొప్ప పాత్ర అయినా
సరే దాని బలహీనత ఆయన దృష్టినుండి తప్పించుకోదు. చివరికి కృష్ణుని దివ్యత్వం కూడా మచ్చలేనిది కాదు. తన లక్ష్యాలను
సాధించడానికి తరచుగా అనుచితమైన వ్యూహాలు పన్నుతాడు. యుద్ధాంతంలో పరమ సత్యమనేది ఏదీ లేదని భీష్మపితామహుడు
యుధిష్ఠిరునికి చెప్పడం ఎంత సముచితం.
కాని మహాభారతం కేవలం ఒక యుద్ధగాథ మాత్రమే కాదు. మానవ అస్తిత్వాన్ని గురించిన అద్భుతమైన ఆలోచనలతో నిండి ఉందది.
యక్ష ప్రశ్నలకు యుధిష్ఠిరుని సమాధానాలు వివేకానికి పరాకాష్ఠ అయితే యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన ‘భగవద్గీత’
– బహుశా మనకు తెలిసిన ఏ భాషలో నయినా లభిస్తున్న మహాసుందరమైన ఏకైక తాత్త్వికగీతం – (ఆల్డస్ హక్జ్‌లీ) నవలా కారుడుగా,
కవిగా, నాటకకర్తగా తన ప్రతిభనుపయోగించి శివ్ కె.కుమార్ ఈ మహేతిహాసాన్ని మూలకథాసూత్రానికి ఎటువంటి భంగం కలగకుండా,
నవలగా చదవడానికి కావలసిన రంగునూ, రుచినీ ఇవ్వడానికి ప్రయత్నించారు.
రామాయణం తర్వాత ప్రపంచ సాహిత్యంలోనే ప్రాచీనమైన మహేతిహాసం వ్యాస మహాభారతం. ఈ ఇతిహాసంలో మన ఊహకు అందే మానవ సహజమైన ప్రతి భావోద్వేగమూ – ప్రేమ, అసహ్యం, ఈర్ష్య, అసూయ, ప్రతీకారం, ద్రోహం, వాత్సల్యం, క్షమ – వర్ణితమయ్యాయి. వ్యాసుని ప్రతిభలో గణనీయమైన లక్షణం ఆయా పాత్రల చిత్రణలో ఆయన చూపించిన నిజాయితీ, సాహసం. అదెంత గొప్ప పాత్ర అయినా సరే దాని బలహీనత ఆయన దృష్టినుండి తప్పించుకోదు. చివరికి కృష్ణుని దివ్యత్వం కూడా మచ్చలేనిది కాదు. తన లక్ష్యాలను సాధించడానికి తరచుగా అనుచితమైన వ్యూహాలు పన్నుతాడు. యుద్ధాంతంలో పరమ సత్యమనేది ఏదీ లేదని భీష్మపితామహుడు యుధిష్ఠిరునికి చెప్పడం ఎంత సముచితం. కాని మహాభారతం కేవలం ఒక యుద్ధగాథ మాత్రమే కాదు. మానవ అస్తిత్వాన్ని గురించిన అద్భుతమైన ఆలోచనలతో నిండి ఉందది. యక్ష ప్రశ్నలకు యుధిష్ఠిరుని సమాధానాలు వివేకానికి పరాకాష్ఠ అయితే యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన ‘భగవద్గీత’ – బహుశా మనకు తెలిసిన ఏ భాషలో నయినా లభిస్తున్న మహాసుందరమైన ఏకైక తాత్త్వికగీతం – (ఆల్డస్ హక్జ్‌లీ) నవలా కారుడుగా, కవిగా, నాటకకర్తగా తన ప్రతిభనుపయోగించి శివ్ కె.కుమార్ ఈ మహేతిహాసాన్ని మూలకథాసూత్రానికి ఎటువంటి భంగం కలగకుండా, నవలగా చదవడానికి కావలసిన రంగునూ, రుచినీ ఇవ్వడానికి ప్రయత్నించారు.© 2017,www.logili.com All Rights Reserved.