ప్రాచీన సంస్కృత వాజ్మయమును ఒక నూత్నరీతిలో పరిశోధించిన విమర్శకుడిగా సుబ్రహ్మణ్యశాస్త్రి పేరు గడించెను. సనాతన, అధునాతన విధానముల మేలి కలయికయని చెప్పదగు ఒక నవ్య విమర్శన రీతిని ఆయన ప్రవేశపెట్టెను. అట్టి కృషికి ఫలితముగ ఆ పండితుని లేఖినినుండి మహాభారత చరిత్ర అను విమర్శనాత్మక గ్రంథము వెలువడినది. ఆ గ్రంథము ఆంద్రదేశపు పండిత లోకమున ఒక కల్లోలమును రేపినది. ఆ గ్రంథమును సమర్థించుచు కొందరు, వ్యతిరేకించుచు కొందరు వాదవివాదములకు దిగిరి. కొందరు సమర్ధించగా మరికొందరు ఖండించారు.
భారత భాగవత హరివంశ విష్ణుపురాణాద్యనేకగ్రంథ పరిశీలన చేసి బ్రహ్మశ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు తాము కనిపెట్టిన కొత్త విషయములను ఈ మహాభారత చరిత్రములో పొందుపరచియున్నారు.
ప్రాచీన సంస్కృత వాజ్మయమును ఒక నూత్నరీతిలో పరిశోధించిన విమర్శకుడిగా సుబ్రహ్మణ్యశాస్త్రి పేరు గడించెను. సనాతన, అధునాతన విధానముల మేలి కలయికయని చెప్పదగు ఒక నవ్య విమర్శన రీతిని ఆయన ప్రవేశపెట్టెను. అట్టి కృషికి ఫలితముగ ఆ పండితుని లేఖినినుండి మహాభారత చరిత్ర అను విమర్శనాత్మక గ్రంథము వెలువడినది. ఆ గ్రంథము ఆంద్రదేశపు పండిత లోకమున ఒక కల్లోలమును రేపినది. ఆ గ్రంథమును సమర్థించుచు కొందరు, వ్యతిరేకించుచు కొందరు వాదవివాదములకు దిగిరి. కొందరు సమర్ధించగా మరికొందరు ఖండించారు. భారత భాగవత హరివంశ విష్ణుపురాణాద్యనేకగ్రంథ పరిశీలన చేసి బ్రహ్మశ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు తాము కనిపెట్టిన కొత్త విషయములను ఈ మహాభారత చరిత్రములో పొందుపరచియున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.