డా. గుంజి వెంకటరత్నం (జననం 16-05-1937). నెల్లూరు జిల్లా కలిచేడులో జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి. పొందారు. వరంగల్లు సికెఎం కళాశాలలో 1970 నుండి తెలుగుశాఖలో లెక్చరర్‌గాను, రీడర్ గాను, శాఖాధ్యక్షుడుగాను పనిచేసి 1995లో పదవీ విరమణ చేశారు. 'హంసవింశతి' పై విశిష్టమైన కృషిచేశారు. విజ్ఞాన సర్వస్వాల నిర్మాణం వెంకటరత్నంగారి అభిమానాంశం. విజ్ఞాన సర్వస్వాల నిర్మాణ పద్ధతుల గురించే ప్రత్యేక గ్రంథాలు రచించారు. స్వంతంగా విజ్ఞాన సర్వస్వాలు కూర్చారు. వాటిలో చెప్పుకోదగినది మహాభారత విజ్ఞాన సర్వస్వం. నామ విజ్ఞానం, సూక్తి విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం అని మూడు భాగాలుగా విభజించుకొని ఆయన కూర్చిన ఈ విజ్ఞాన సర్వస్వం తెలుగులో విశిష్టమైన గ్రంథం.
వెంకటరత్నం గారు కవి, విమర్శకుడు, నాటకకర్త, బహు గ్రంథ కర్త. వీరి రచనలనేకం ప్రచురితమయ్యాయి. మరెన్నో ప్రచురితం కావలసి ఉన్నాయి. ఆయన అనేక సన్మానాలు పొందారు.