తెలుగు కవిత్వాన్ని ఊరూరూ, వాడవాడలా ఊరేగించిన వారు, తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేయించిన కవిరాజులుగా , శ్రీ తిరుపతి వెంకటవులుగా లోక ప్రఖ్యాతిగాంచిన వారు శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి మరియు శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి. "తిరుపతియింతండు వెంకటేశ్వరుడనెను వెరసి తిరుపతి వెంకటేశ్వరుల మేము" అని ఊరూరూ చాటుకున్నారు. వారు అడవిలో ఉసిరికాయ సముద్రంలో ఉప్పుకలిసి నట్టుగా కలిసిపోయారు.
బుద్ధ చరిత్రము రచన వీరికి గొప్ప కీర్తి సంపాదించి పెట్టిన కావ్యం. ఇది పోలవరం జమీందారు కొచ్చెర్లకోట వెంకట కృష్ణారావుగారి కోరిక పై రచించి వారికే అంకితం ఇవ్వబడింది. వీరికి చిరాయశస్సును సముపార్జించిపెట్టిన నాటకాలు "పాండవోద్యగ విజయాలు," ఇందులోని పద్యాలు తెలుగువారి నోళ్ళలో అవలీలగా కదులుతాయి.