ఆర్యా శబ్దము అమ్మవారికి వాచకము. అది ప్రణవము వంటిది. ”ఆరాద్ యాతి "అని ఒక వ్యుత్పత్తి కలదు. దూరముగా పోవునది అని స్థూలముగా అరము. దూరముగా పోవుట అనగా ఎక్కడనో తెలియరానిచోట ఉండుట. ఉపనిషత్తులలో బ్రహ్మ తత్త్వమునుగూర్చి “తదూరం తద్వనికే” అనుమాటలు కన్పట్టును. పరమాత్మ తత్త్వము ఎంతదూరముగా ఉన్నట్లనిపించునో అంత దగ్గరగా కూడా ఉండును. ఆరాత్ శబ్దము దూరసమీప ఉభయార్థకము. “ఆర్య” అనగా దూరముగా పోవునది. దగ్గరకు చేరునది అను రెండర్థములను చెప్పు కొనుటకు వీలయినది.
“శ్రీవిద్య”అనునది చాలా మందికి పరిచితమైనదియే. శ్రీ అనగా శక్తి స్వరూపము. శ్రీ అనగా “ఋచో యజూంషి సామాని సా హి శ్రీరమృతా సతామ్” అను ఆర్షవాక్యమును బట్టి బ్రహ్మవిద్య, సాంకేతికముగా ఆ బ్రహ్మవిద్య నే “ఉమా” శబ్దము కూడా తెలిచేయును. అఉమకార క్రమముతో "ఓమ్” ఉకారమకారఅకారాత్మకముగా "ఉమ”. ఉమ అనగా మరోక విధముగా తెలియవచ్చు పరతత్త్వమే.
ఆర్యా శబ్దము అమ్మవారికి వాచకము. అది ప్రణవము వంటిది. ”ఆరాద్ యాతి "అని ఒక వ్యుత్పత్తి కలదు. దూరముగా పోవునది అని స్థూలముగా అరము. దూరముగా పోవుట అనగా ఎక్కడనో తెలియరానిచోట ఉండుట. ఉపనిషత్తులలో బ్రహ్మ తత్త్వమునుగూర్చి “తదూరం తద్వనికే” అనుమాటలు కన్పట్టును. పరమాత్మ తత్త్వము ఎంతదూరముగా ఉన్నట్లనిపించునో అంత దగ్గరగా కూడా ఉండును. ఆరాత్ శబ్దము దూరసమీప ఉభయార్థకము. “ఆర్య” అనగా దూరముగా పోవునది. దగ్గరకు చేరునది అను రెండర్థములను చెప్పు కొనుటకు వీలయినది. “శ్రీవిద్య”అనునది చాలా మందికి పరిచితమైనదియే. శ్రీ అనగా శక్తి స్వరూపము. శ్రీ అనగా “ఋచో యజూంషి సామాని సా హి శ్రీరమృతా సతామ్” అను ఆర్షవాక్యమును బట్టి బ్రహ్మవిద్య, సాంకేతికముగా ఆ బ్రహ్మవిద్య నే “ఉమా” శబ్దము కూడా తెలిచేయును. అఉమకార క్రమముతో "ఓమ్” ఉకారమకారఅకారాత్మకముగా "ఉమ”. ఉమ అనగా మరోక విధముగా తెలియవచ్చు పరతత్త్వమే.© 2017,www.logili.com All Rights Reserved.