మూకపంచశతి శ్రీ కామాక్షిదేవి కరుణకు పాత్రుడైన మూకకవి విరచిత పంచశతి' నందు - ఒక శిశువు కన్ను మొదలైన ఇంద్రియముల మేర్పడుటకు ముందు మనోభావమాత్రముచేత తన కోరిక నెట్లు అంచునో అట్లే ఆర్యాశతకమునందు భక్తశిశువు యొక్క మనః ప్రవృత్తిని అంబికాస్వరూపానుసంధానముగ స్పష్టపరచెను.
శిశువు కొంచెం గ్రహణశక్తి పెంపొందిన మీదట తన దాపున వర్తించు వస్తువు యొక్క దర్శన స్పర్శనాదులచే ఎట్లు ఆనందింపగల్గునో అట్లే భక్తబాలుడు మిక్కిలి క్రిందుగా తన కందుబాటులో ఉన్న జగన్మాత పాదారవిన్ద సందర్శనానందమనుభవించునని పాదారవిన్దశతకము న వెల్లడించెను.
మనస్సు జ్ఞానేంద్రియముల యొక్క స్ఫూర్తి తర్వాతే వాక్రసారమగును. అట్లే తన ప్రేమకు స్థానమైన వస్తువును నిరర్గళముగ స్తుతిశతకము న స్తుతించెను. లౌకిక విద్యలయందు నేర్పరియగు నొక యువకుడుఎట్లులౌకికసంపదలనుబడయనర్హుడగునోఅట్లే ఇతఃపూర్వకృప, స్తుతికి ఫలంగా భక్తుడు అంబికా కటాక్ష విశేషమును బడని పరమజ్ఞానానుభవము పొందుటకు పాత్రము కాగలడని కటాక్షశతకము నందు సూచించెను.
లౌకికైశ్వర్య సంపూర్ణుడొకడు మంచి వయసులో తానెట్లు శృంగార సుఖానుభవమునకు పాత్రుడగునో అట్లే దేవి అనుగ్రహపాత్రుడైనవాడు ఆ తల్లి మందస్మిత చంద్రికాయుతుడై ఆనంద చంద్రునివలె అలౌకిక నిరతశయానందానుభవస్వరూపుడై ప్రకాశించునని మందస్మిత శతకమున ఆవిష్కరించెను. ఈ స్తుతి పఠించు మాత్రమున సాధకుడు పరదేవతతోడ ఐక్యాత్మానుభూతిని బడసిన స్థితి నందగలడు.
© 2017,www.logili.com All Rights Reserved.