ఏదైనా ఒక పనిని మంచికాలంలో ప్రారంభించమంటారు. అదే సుముహూర్తకాలం. నవగ్రహముల యొక్క ప్రభావం మానవ జీవితం మీద ఎంతగానో ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అలాగే కొన్ని నక్షత్రాలు, తిధులు, వారాలు కలిసున్నప్పుడు కొన్ని యోగాలు కలుగుతాయని పెద్దలు, పండితులు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
రామ పట్టాభిషేకానికి సుముహూర్తం నిశ్చయించగా అదే ముహూర్తానికి రాముడు వనవాసానికి వెళ్ళాడు. ఆ ముహూర్తం పట్టాభిషేకానికి కాక వనవాసానికేనంటారు. అలాగే రావణాసురుడు సీతాదేవిని వింద్య ముహూర్తంలో అపహరించుకుపోయిన విషయం జటాయువు రామునికి తెలియజేస్తూ రామా! చింతించకు రావణుడు సీతను వింద్య ముహూర్తంలో అపహరించాడు' కనుక వాడు నాశనమైపోతాడు అంటూ ఓదారుస్తాడు.
- కె. అచ్చిరెడ్డి