ప్రపత్తి, శరణాగతి లాంటివి వైష్ణవ పరిభాషలు. ప్రపత్తి శబ్దానికి ఆధ్యాత్మికపరంగా మానసిక అధ్యవసాయాత్మక జ్ఞానమని అర్థం. భగవంతుడొకడే నాకు రక్షకుడు అనే గట్టి విశ్వాసము ప్రపత్తి లక్షణం. జీవుడు స్వామికి తన సర్వస్వాన్ని సమర్పించుకోవడమే ప్రపత్తి స్వరూపం. ఈ శబ్దాన్ని అభిమానించి సాహిత్యాధ్యయనమే సర్వస్వంగా భావించినవారు ఆచార్య దావులూరి కృష్ణకుమారి గారు. ఆ జ్ఞాన ఫలితమే నవవ్యాస సంపుటి.
'ప్రపత్తి' లో రెండు వ్యాసాలూ పురాణాలను పరిచయం చేస్తాయి. నాలుగు అక్షరాల 'అన్నమయ్య' పేరులాగే నాలుగు వ్యాసాలూ అన్నమయ్యపదాల విశిష్టతను చాటి చెబుతాయి. మరొకటి సంకీర్తనల పద్య పరివర్తను కొండాడితే ఇంకొకటి ఆళ్వారుల ఇద్దరి అనుబంధాన్ని అద్దం పట్టిస్తుంది. చివరిది కల్యాణాత్మక సంస్కృతిని స్పష్టం చేసి మంగళాశాసనం చేస్తుంది.
ప్రపత్తి, శరణాగతి లాంటివి వైష్ణవ పరిభాషలు. ప్రపత్తి శబ్దానికి ఆధ్యాత్మికపరంగా మానసిక అధ్యవసాయాత్మక జ్ఞానమని అర్థం. భగవంతుడొకడే నాకు రక్షకుడు అనే గట్టి విశ్వాసము ప్రపత్తి లక్షణం. జీవుడు స్వామికి తన సర్వస్వాన్ని సమర్పించుకోవడమే ప్రపత్తి స్వరూపం. ఈ శబ్దాన్ని అభిమానించి సాహిత్యాధ్యయనమే సర్వస్వంగా భావించినవారు ఆచార్య దావులూరి కృష్ణకుమారి గారు. ఆ జ్ఞాన ఫలితమే నవవ్యాస సంపుటి. 'ప్రపత్తి' లో రెండు వ్యాసాలూ పురాణాలను పరిచయం చేస్తాయి. నాలుగు అక్షరాల 'అన్నమయ్య' పేరులాగే నాలుగు వ్యాసాలూ అన్నమయ్యపదాల విశిష్టతను చాటి చెబుతాయి. మరొకటి సంకీర్తనల పద్య పరివర్తను కొండాడితే ఇంకొకటి ఆళ్వారుల ఇద్దరి అనుబంధాన్ని అద్దం పట్టిస్తుంది. చివరిది కల్యాణాత్మక సంస్కృతిని స్పష్టం చేసి మంగళాశాసనం చేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.