అందరికీ కావలసిన వ్యక్తిని గురించి, అందరికి ఆదర్శనీయుడైన వ్యక్తిని గురించి, ఎంతోమందికి ఆచరణయోగ్యుడైన వ్యక్తిని గురించి వ్రాయడం వ్రాయబూనటం సాహితీలోకంలోనే అరుదైన ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఎందరికో ఉపయోగం ఉంటుంది. ఎందరో తమ జీవితాల్ని సక్రమంగా మల్చుకునే అవకాసం ఉంటుంది. తప్పుదారి పట్టకుండా క్షణం ఆగి అలోచించి సముచిత నిర్ణయాన్ని తీసుకునే వీలవుతుంది. ఎందరికో మార్గదర్శకం కాగల అవకాశముంటుంది. అందుకే ఈ ప్రక్రియ అరుదూ - అపూర్వం.
కోట్లాది అభిమానుల హృదయాల్లో ఆరాధ్యనీయునిగా నీరాజనాలందుకునే కథానాయకుడ్ని గురించి తెలియని వారుండరు. ఐనా తెలియని వారికి తెలియని అంశాలనూ, తెలిసిన వారికి తెలుపవలసిన అంశాలనూ, తెలిసీ తెలియని వారికి తేటతెల్లమయేలా తెలియజెప్పగల అంశాలనూ అక్కినేని పరంగా పరకాయప్రవేశం చేసి వ్రాయటం జరిగింది.
ఇది అక్కినేని అంతరంగ మథన౦. బాగుపడాలనుకునే వారికి మెదడును పదునుపెట్టి జీవితం గురించి ఆత్మపరిశీలన చేసుకొంటానికి అవకాశం కలిగించి అడుగు ముందుకు వేసే ముందు మంచిచెడులు గురించిన తర్కాన్ని మనసులో రేపే అవకాశాన్ని కల్పించేది - ఎందరికో మార్గదర్శకం కాగలది - ఒక ప్రయోజనం కోసం వ్రాసినద
ఇది కథ కాదు. నేను ఏరుకున్న అమూల్యసంపదను అక్షరరూపంలో పొందుపరచిన విజ్ఞాపనం. ఆత్రంతో ఏరుకున్న సంపద తాలూకూ అక్షరమాలికలో ఒకచోట వజ్రాలుండవచ్చు. మరొకచోట వైడూర్యాలుండవచ్చు. వేరొకచోట ముత్యాలు కుప్పలుగా వుండచ్చు. రత్నాల మాలిక లుండొచ్చు. క్రమంలో ఉండొచ్చూ క్రమం తప్పి ఉండవచ్చు.
నేను చేపట్టిన కార్యం అటువంటిది. ఏమైనా అంతా అమూల్యమే. ఇతరుల ప్రయోజనం కోసం పొండుపరచబడినదే. అదృష్టమనేది ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో వరిస్తుంది. నన్ను నా దేవత ఈ విధంగా ఆలింగనం చేసుకుంది. అందుకే - అందుకే ఒక ''మహా మనిషి'' నా నుంచి ఆవిర్భవించాడు.
తల్లి తొమ్మిది నెలలే మోసి కంటే 'మనీషిని' రెండు సంవత్సరాలపైగా మోసి కన్నాను. ఈ రెండు సంవత్సరాలూ పరకాయ ప్రవేశం చేశాను. ఒక మేధావి అంతరంగాన్ని మధించే బృహత్కర కార్యనిర్వహణలో ఆ మేధావి అంతరంగ తరంగవేగాన్ని అందుకునే అతికష్టసాధ్యమైన సాహసంతో, విచిత్ర అనుభూతులతో ఆవేదననూ, ఆత్మసంఘర్షణనూ, చివరికి అలౌకికానందాన్ని కూడా అందుకున్నాను. నిజంగా ఇటువంటి సాహసోపేతమైన రచన చేయడానికి ఏంతో గుండెధైర్యం కావాలి. మరెంతో పరిశీలనాత్మక శక్తి పరిశోధనా కావాలి. ఇవన్నీ నాకు చిన్నతనంలోనే సంక్రమించాయి -
అన్నయ్య అక్కినేని ద్వారా. అందరికీ అక్కినేని వెండితెర చందమామే - నాక్కూడా.
మంచిని తెలిపే ఎన్నో విషయాలతో, అన్నయ్య జ్ఞాపకాలతో ఈ పుస్తకం ప్రచురితమయ్యింది.
- డాక్టర్ కె.వి.కృష్ణకుమారి
అందరికీ కావలసిన వ్యక్తిని గురించి, అందరికి ఆదర్శనీయుడైన వ్యక్తిని గురించి, ఎంతోమందికి ఆచరణయోగ్యుడైన వ్యక్తిని గురించి వ్రాయడం వ్రాయబూనటం సాహితీలోకంలోనే అరుదైన ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఎందరికో ఉపయోగం ఉంటుంది. ఎందరో తమ జీవితాల్ని సక్రమంగా మల్చుకునే అవకాసం ఉంటుంది. తప్పుదారి పట్టకుండా క్షణం ఆగి అలోచించి సముచిత నిర్ణయాన్ని తీసుకునే వీలవుతుంది. ఎందరికో మార్గదర్శకం కాగల అవకాశముంటుంది. అందుకే ఈ ప్రక్రియ అరుదూ - అపూర్వం. కోట్లాది అభిమానుల హృదయాల్లో ఆరాధ్యనీయునిగా నీరాజనాలందుకునే కథానాయకుడ్ని గురించి తెలియని వారుండరు. ఐనా తెలియని వారికి తెలియని అంశాలనూ, తెలిసిన వారికి తెలుపవలసిన అంశాలనూ, తెలిసీ తెలియని వారికి తేటతెల్లమయేలా తెలియజెప్పగల అంశాలనూ అక్కినేని పరంగా పరకాయప్రవేశం చేసి వ్రాయటం జరిగింది. ఇది అక్కినేని అంతరంగ మథన౦. బాగుపడాలనుకునే వారికి మెదడును పదునుపెట్టి జీవితం గురించి ఆత్మపరిశీలన చేసుకొంటానికి అవకాశం కలిగించి అడుగు ముందుకు వేసే ముందు మంచిచెడులు గురించిన తర్కాన్ని మనసులో రేపే అవకాశాన్ని కల్పించేది - ఎందరికో మార్గదర్శకం కాగలది - ఒక ప్రయోజనం కోసం వ్రాసినద ఇది కథ కాదు. నేను ఏరుకున్న అమూల్యసంపదను అక్షరరూపంలో పొందుపరచిన విజ్ఞాపనం. ఆత్రంతో ఏరుకున్న సంపద తాలూకూ అక్షరమాలికలో ఒకచోట వజ్రాలుండవచ్చు. మరొకచోట వైడూర్యాలుండవచ్చు. వేరొకచోట ముత్యాలు కుప్పలుగా వుండచ్చు. రత్నాల మాలిక లుండొచ్చు. క్రమంలో ఉండొచ్చూ క్రమం తప్పి ఉండవచ్చు. నేను చేపట్టిన కార్యం అటువంటిది. ఏమైనా అంతా అమూల్యమే. ఇతరుల ప్రయోజనం కోసం పొండుపరచబడినదే. అదృష్టమనేది ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో వరిస్తుంది. నన్ను నా దేవత ఈ విధంగా ఆలింగనం చేసుకుంది. అందుకే - అందుకే ఒక ''మహా మనిషి'' నా నుంచి ఆవిర్భవించాడు. తల్లి తొమ్మిది నెలలే మోసి కంటే 'మనీషిని' రెండు సంవత్సరాలపైగా మోసి కన్నాను. ఈ రెండు సంవత్సరాలూ పరకాయ ప్రవేశం చేశాను. ఒక మేధావి అంతరంగాన్ని మధించే బృహత్కర కార్యనిర్వహణలో ఆ మేధావి అంతరంగ తరంగవేగాన్ని అందుకునే అతికష్టసాధ్యమైన సాహసంతో, విచిత్ర అనుభూతులతో ఆవేదననూ, ఆత్మసంఘర్షణనూ, చివరికి అలౌకికానందాన్ని కూడా అందుకున్నాను. నిజంగా ఇటువంటి సాహసోపేతమైన రచన చేయడానికి ఏంతో గుండెధైర్యం కావాలి. మరెంతో పరిశీలనాత్మక శక్తి పరిశోధనా కావాలి. ఇవన్నీ నాకు చిన్నతనంలోనే సంక్రమించాయి - అన్నయ్య అక్కినేని ద్వారా. అందరికీ అక్కినేని వెండితెర చందమామే - నాక్కూడా. మంచిని తెలిపే ఎన్నో విషయాలతో, అన్నయ్య జ్ఞాపకాలతో ఈ పుస్తకం ప్రచురితమయ్యింది. - డాక్టర్ కె.వి.కృష్ణకుమారి© 2017,www.logili.com All Rights Reserved.