'రామమార్గం' కేవలం ఒక రచన మాత్రమే కాదు. ఇది ఒక ప్రయోగం. తాను దర్శించిన రామకథాసారాంశాలను సమాజంతో పంచుకోవాలనే తపన రచయిత్రి లావణ్యలో ఉంది. 'రామనామ మహిమ' దగ్గర నుంచి ప్రారంభించి రాముడి వ్యక్తిత్వం, రామరాజ్య స్వరూపం, సీతాచరితం, పితృభక్తి, సోదరప్రేమ, మైత్రి, హనుమత్ దర్శనం వంటి విభిన్న పార్శ్వాలను విశ్లేషిస్తూ సాగింది ఈ రచన. ఒక్క రాముడి వ్యక్తిత్వం ఈ రచయిత్రికి 16 కోణాలలో దర్శనమైంది. అలాగే సీతాదేవి వ్యక్తిత్వాన్ని ఎనిమిది కోణాలలో దర్శించారు. రామరాజ్యం గురిచ్న్హి ఏడూ విధాలుగా ఆమె వర్ణించారు. రామాయణంలో సోదరుల జంట, భార్యాభర్తల జంట, మిత్రుల జంట, గురుశిష్యుల జంట వంటి విభిన్న పాత్రల సమూహాలను ఆమె విశ్లేషించారు.
ఇక హనుమంతుని పాత్రలోని విశిష్టతల గురించి ఎన్ని రకాలుగా విశ్లేషిస్తే సమగ్రమవుతుంది? ఒక గ్రంథం సరిపోదు. అయినా, ఆయన చాకచక్యత, సమయస్పూర్తి ఇలా అరుదైన ఎన్నో అంశాలను అయిదు పార్శ్వాలలో ఆమె తన శక్తి మేరకు పరిశీలించారు. బుద్దికుశలత, కార్యదీక్ష, వినయం, శౌర్యం, అంటూ మరికొన్ని అధ్యాయాలలో 'హనుమ' వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని వర్ణించారు. తనకు ఎన్ని నామాలున్నా 'రామదూత' అనిపించుకోవడంలోనే హనుమంతునికి ఆనందం ఉప్పొంగుతుందంటూ ఆమె సోదాహరణంగా వర్ణించారు.
ఇలా పాత్రల గురించి వర్ణిస్తూ క్రౌంచపక్షుల జంటపై బోయవాడు సంధించిన బాణానికి వాల్మీకీ హృదయం ఎలా స్పందించింది దగ్గర నుంచి ఉత్తర రామచరితంలో సీతాదేవి అంతర్ధానమవుతూ భూదేవిని ప్రార్థించే సమయంలో రాముడికి కలిగిన ఉద్విగ్న భావాల వరకు గల ముఖ్య ఘట్టాలను వర్ణించారు. ఇంతటి ప్రయత్నం, ప్రయోగం చేసిన లావణ్య కుటుంబానికి మా ఆశీస్సులు.
- స్వామి పరిపూర్ణానంద్
'రామమార్గం' కేవలం ఒక రచన మాత్రమే కాదు. ఇది ఒక ప్రయోగం. తాను దర్శించిన రామకథాసారాంశాలను సమాజంతో పంచుకోవాలనే తపన రచయిత్రి లావణ్యలో ఉంది. 'రామనామ మహిమ' దగ్గర నుంచి ప్రారంభించి రాముడి వ్యక్తిత్వం, రామరాజ్య స్వరూపం, సీతాచరితం, పితృభక్తి, సోదరప్రేమ, మైత్రి, హనుమత్ దర్శనం వంటి విభిన్న పార్శ్వాలను విశ్లేషిస్తూ సాగింది ఈ రచన. ఒక్క రాముడి వ్యక్తిత్వం ఈ రచయిత్రికి 16 కోణాలలో దర్శనమైంది. అలాగే సీతాదేవి వ్యక్తిత్వాన్ని ఎనిమిది కోణాలలో దర్శించారు. రామరాజ్యం గురిచ్న్హి ఏడూ విధాలుగా ఆమె వర్ణించారు. రామాయణంలో సోదరుల జంట, భార్యాభర్తల జంట, మిత్రుల జంట, గురుశిష్యుల జంట వంటి విభిన్న పాత్రల సమూహాలను ఆమె విశ్లేషించారు. ఇక హనుమంతుని పాత్రలోని విశిష్టతల గురించి ఎన్ని రకాలుగా విశ్లేషిస్తే సమగ్రమవుతుంది? ఒక గ్రంథం సరిపోదు. అయినా, ఆయన చాకచక్యత, సమయస్పూర్తి ఇలా అరుదైన ఎన్నో అంశాలను అయిదు పార్శ్వాలలో ఆమె తన శక్తి మేరకు పరిశీలించారు. బుద్దికుశలత, కార్యదీక్ష, వినయం, శౌర్యం, అంటూ మరికొన్ని అధ్యాయాలలో 'హనుమ' వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని వర్ణించారు. తనకు ఎన్ని నామాలున్నా 'రామదూత' అనిపించుకోవడంలోనే హనుమంతునికి ఆనందం ఉప్పొంగుతుందంటూ ఆమె సోదాహరణంగా వర్ణించారు. ఇలా పాత్రల గురించి వర్ణిస్తూ క్రౌంచపక్షుల జంటపై బోయవాడు సంధించిన బాణానికి వాల్మీకీ హృదయం ఎలా స్పందించింది దగ్గర నుంచి ఉత్తర రామచరితంలో సీతాదేవి అంతర్ధానమవుతూ భూదేవిని ప్రార్థించే సమయంలో రాముడికి కలిగిన ఉద్విగ్న భావాల వరకు గల ముఖ్య ఘట్టాలను వర్ణించారు. ఇంతటి ప్రయత్నం, ప్రయోగం చేసిన లావణ్య కుటుంబానికి మా ఆశీస్సులు. - స్వామి పరిపూర్ణానంద్© 2017,www.logili.com All Rights Reserved.