మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితవర్గాల వారి గురించి చెప్పినటువంటి అన్ని బోధనలూ, రచనలూ వెనుకబడిన కులాలకు, జాతులకు కూడా వర్తిస్తాయి. ఆయన బోధనలన్నీ బహుజనలందరూ ఏకమై రాజ్యాధికారం సంపాదించాలన్న గమ్యం కోసమే. నిజానికి దళితులకు, వెనుకబడిన కులాలు, జాతులకూ పీడనలో, వివక్షతలో, అవమానాలలో ఎటువంటి తేడాలూ లేవు. ఒక్క హిందూమతం అంటగట్టిన 'కులం' అనే సంకుచిత మానసిక జాడ్యం తప్ప. ఆ సంకుచిత అహంకారాల నుండి వారు బయటపడి దళిత జాతులతో కలిసి పనిచేస్తే లోకానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఆ దిశలో వారికీ వీరికీ మధ్యన నిర్మించిన బహుజన వారధియే ఈ వ్యాసాల సంకలనం. కొన్నిచోట్ల మరీ పచ్చిగా వ్యవహారిక శైలిలో రాసినట్టు మీకు అనిపించవచ్చు. అదంతా చెప్పలేనంత దుఃఖం వల్లనే అని గుర్తించవలసిందిగా మనవి చేస్తున్నాను. ముందర ముందర ఇంకా కట్టుదిట్టంగా రూపొందాలని నా ఆకాంక్ష. అందరికీ, ప్రచురణకర్తలకూ, మిత్రుడు సమత పబ్లిషర్స్ డైరెక్టర్ ఈశ్వర్ కూ నా ప్రత్యేక కృతఙ్ఞతలు. ఈ గ్రంథాన్ని ప్రచురిస్తున్న పల్లవి పబ్లికేషన్స్ వారి సౌహార్ధ్రతను మరువలేను.
- జై భీములతో డి నటరాజ్
మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితవర్గాల వారి గురించి చెప్పినటువంటి అన్ని బోధనలూ, రచనలూ వెనుకబడిన కులాలకు, జాతులకు కూడా వర్తిస్తాయి. ఆయన బోధనలన్నీ బహుజనలందరూ ఏకమై రాజ్యాధికారం సంపాదించాలన్న గమ్యం కోసమే. నిజానికి దళితులకు, వెనుకబడిన కులాలు, జాతులకూ పీడనలో, వివక్షతలో, అవమానాలలో ఎటువంటి తేడాలూ లేవు. ఒక్క హిందూమతం అంటగట్టిన 'కులం' అనే సంకుచిత మానసిక జాడ్యం తప్ప. ఆ సంకుచిత అహంకారాల నుండి వారు బయటపడి దళిత జాతులతో కలిసి పనిచేస్తే లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ దిశలో వారికీ వీరికీ మధ్యన నిర్మించిన బహుజన వారధియే ఈ వ్యాసాల సంకలనం. కొన్నిచోట్ల మరీ పచ్చిగా వ్యవహారిక శైలిలో రాసినట్టు మీకు అనిపించవచ్చు. అదంతా చెప్పలేనంత దుఃఖం వల్లనే అని గుర్తించవలసిందిగా మనవి చేస్తున్నాను. ముందర ముందర ఇంకా కట్టుదిట్టంగా రూపొందాలని నా ఆకాంక్ష. అందరికీ, ప్రచురణకర్తలకూ, మిత్రుడు సమత పబ్లిషర్స్ డైరెక్టర్ ఈశ్వర్ కూ నా ప్రత్యేక కృతఙ్ఞతలు. ఈ గ్రంథాన్ని ప్రచురిస్తున్న పల్లవి పబ్లికేషన్స్ వారి సౌహార్ధ్రతను మరువలేను. - జై భీములతో డి నటరాజ్© 2017,www.logili.com All Rights Reserved.