పదే పదే అదే కథా? మళ్ళీ రామకథేనా? వేదాల్లో, బృహత్కథలో, పురాణాల్లో ఎన్ని గొప్ప కథలు లేవని? ఆ కథలేవీ పనికిరావనట్టుగా ప్రతి కవికీ, రచయితకీ రామకథే ఎందుకు అంటే, తమ రచనకి రాముడు అంతటి మహోన్నతమూర్తి మరొకరు లేరంటారు వారంతా. రాముడు ధర్మసూత్రాలతో తీర్చిదిద్దిన శిలావిగ్రహం కాదు, రక్తమాంసాలతో కదిలే నిండైనమనిషి, ఆయనకీ కలలు ఉన్నాయి. కన్నీళ్ళున్నాయి. బాధలు ఉన్నాయి. భయాలు ఉన్నాయి. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడాయన. వాటితో యుద్ధం చేశాడు. జయించాడు. ఆ జితేంద్రియుని జీవితకథ చెప్పడంలో అందం ఉంది. ఆనందం ఉంది.
శుభాలను కలిగిస్తుందనీ, కీర్తిప్రతిష్టలను పెంపొందిస్తుందనీ చెప్పడం అతిశయోక్తి అవుతుందేమోగాని, ఆ పారాయణం మట్టిబొమ్మని మనిషి చేస్తుంది. మనిషిని మనీషిని చేస్తుంది. ఇది నిజం. ఈ నిజాన్ని ఆదికవి వాల్మీకి సంస్కృతంలో చెబితే దానిని ఆబాలగోపాలానికీ అందమైన వ్యావహారికభాషలో ఆనందంగా చెప్పారు అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మ. రెండున్నర సంవత్సరాలపాటు నవ్యవీక్లీలో ధారావాహికంగా వెలువడి, పాఠకజననీరాజనాలు అందుకున్న ఆ రామాయాణాన్ని సచిత్రంగా మీ ముందు ఆవిష్కరిస్తున్నది అమరావతి పబ్లికేషన్స్.
పదే పదే అదే కథా? మళ్ళీ రామకథేనా? వేదాల్లో, బృహత్కథలో, పురాణాల్లో ఎన్ని గొప్ప కథలు లేవని? ఆ కథలేవీ పనికిరావనట్టుగా ప్రతి కవికీ, రచయితకీ రామకథే ఎందుకు అంటే, తమ రచనకి రాముడు అంతటి మహోన్నతమూర్తి మరొకరు లేరంటారు వారంతా. రాముడు ధర్మసూత్రాలతో తీర్చిదిద్దిన శిలావిగ్రహం కాదు, రక్తమాంసాలతో కదిలే నిండైనమనిషి, ఆయనకీ కలలు ఉన్నాయి. కన్నీళ్ళున్నాయి. బాధలు ఉన్నాయి. భయాలు ఉన్నాయి. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడాయన. వాటితో యుద్ధం చేశాడు. జయించాడు. ఆ జితేంద్రియుని జీవితకథ చెప్పడంలో అందం ఉంది. ఆనందం ఉంది. శుభాలను కలిగిస్తుందనీ, కీర్తిప్రతిష్టలను పెంపొందిస్తుందనీ చెప్పడం అతిశయోక్తి అవుతుందేమోగాని, ఆ పారాయణం మట్టిబొమ్మని మనిషి చేస్తుంది. మనిషిని మనీషిని చేస్తుంది. ఇది నిజం. ఈ నిజాన్ని ఆదికవి వాల్మీకి సంస్కృతంలో చెబితే దానిని ఆబాలగోపాలానికీ అందమైన వ్యావహారికభాషలో ఆనందంగా చెప్పారు అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మ. రెండున్నర సంవత్సరాలపాటు నవ్యవీక్లీలో ధారావాహికంగా వెలువడి, పాఠకజననీరాజనాలు అందుకున్న ఆ రామాయాణాన్ని సచిత్రంగా మీ ముందు ఆవిష్కరిస్తున్నది అమరావతి పబ్లికేషన్స్.© 2017,www.logili.com All Rights Reserved.