పేదరాసిపెద్దమ్మ కథలంటే తెలుగింట చెవి కోసుకుంటారు. చిన్నా పెద్దా, ముసలీ ముతకా అందరికీ ఆ కథలంటే చెప్పలేనంత ఇష్టం. తెలుగు జానపద కథాసాహిత్యంలో పేదరాసిపెద్దమ్మది కీలకపాత్ర. ఇంతటి పాత్రను పోషించే ఈ పెద్దమ్మ ఎవరు? ఎందుకు ఆమె ఈ కథలు చెప్పింది? ఎవరికి చెప్పింది? ఈ కథల్లో ఉన్నదేమిటి? అంటే ఈ పుస్తకంలో గల ఇరవై ఏడు కథల్నీ చదివి తీరాలి. ఆంద్రజ్యోతి నవ్యవీక్లీలో ముప్పయి ఆరు వారాలపాటు ధారావాహికంగా వెలువడి. అనేక ప్రశంసలు అందుకున్న ఈ కథలు, పాఠకుల్ని నవ్వించి, కవ్వించి, ఏడిపిస్తాయి. ప్రముఖ కథారచయిత జగన్నాథశర్మ అందించిన ఈ కథలు ఆబాలగోపాలానికీ ప్రత్యేకం.
ఒంటరితనానికి ఓదార్పు కలిగిస్తాయి ఈ కథలు. జంటలకి జలకాలాటలనిపిస్తాయి. పిల్లలకు పప్పుబెల్లాలనిపిస్తే, పెద్దలకు బాల్యాన్ని గుర్తుచేసి, అమ్మ గోరుముద్దలనిపిస్తాయి ఈ కథలు. నాన్న కౌగిలి, అత్తఒడి, అక్క దీవెన ఈ కథలు. అందుకోండి! చదివి ఆనందించండి.
పేదరాసిపెద్దమ్మ కథలంటే తెలుగింట చెవి కోసుకుంటారు. చిన్నా పెద్దా, ముసలీ ముతకా అందరికీ ఆ కథలంటే చెప్పలేనంత ఇష్టం. తెలుగు జానపద కథాసాహిత్యంలో పేదరాసిపెద్దమ్మది కీలకపాత్ర. ఇంతటి పాత్రను పోషించే ఈ పెద్దమ్మ ఎవరు? ఎందుకు ఆమె ఈ కథలు చెప్పింది? ఎవరికి చెప్పింది? ఈ కథల్లో ఉన్నదేమిటి? అంటే ఈ పుస్తకంలో గల ఇరవై ఏడు కథల్నీ చదివి తీరాలి. ఆంద్రజ్యోతి నవ్యవీక్లీలో ముప్పయి ఆరు వారాలపాటు ధారావాహికంగా వెలువడి. అనేక ప్రశంసలు అందుకున్న ఈ కథలు, పాఠకుల్ని నవ్వించి, కవ్వించి, ఏడిపిస్తాయి. ప్రముఖ కథారచయిత జగన్నాథశర్మ అందించిన ఈ కథలు ఆబాలగోపాలానికీ ప్రత్యేకం. ఒంటరితనానికి ఓదార్పు కలిగిస్తాయి ఈ కథలు. జంటలకి జలకాలాటలనిపిస్తాయి. పిల్లలకు పప్పుబెల్లాలనిపిస్తే, పెద్దలకు బాల్యాన్ని గుర్తుచేసి, అమ్మ గోరుముద్దలనిపిస్తాయి ఈ కథలు. నాన్న కౌగిలి, అత్తఒడి, అక్క దీవెన ఈ కథలు. అందుకోండి! చదివి ఆనందించండి.188 rs
© 2017,www.logili.com All Rights Reserved.