గతంలో మహాన్యాసపూర్వక రుద్రార్చనాభిషేక విధి, మహాన్యాసమంత్రవ్యాఖ్య, శ్రీ రుద్రాధ్యాయః, శ్రీ శివపురాణము లాంటి ఎన్నో ఉత్తమ శైవ గ్రంథ రాజములను ఆధ్యాత్మిక ప్రపంచానికి అందజేసియున్నాము.
ఆకోవలోనే ఈ సత్గ్రంథము "శైవోత్సవరత్నాకరము" ను కూడ వెలువరించాము. ఈ గ్రంథ ప్రాచీన ప్రతిని మాన్యులు పాలెం వాస్తవ్యులు శ్రీ వల్లభరావు, కీ.శే. శ్రీ చింతలపూడి వెంకట సుబ్బారావు గారి కుమారులు. శ్రీ శివరామశర్మ, శ్రీ భావనారాయణ, శ్రీ వెంకటశివుడు గార్లు అందజేసారు. వారికి మా కృతఙ్ఞతలు.
ఈ గ్రంథపు ప్రథమ భాగమునందలి ప్రకరణ విభాగములను రత్నములు అనియు, రెండవ భాగము నందలి ప్రకరణ విభాగములకు తరంగములనియు పేరులను సంకలన కర్తలుంచినారు. రత్నాకరము అనగా సముద్రము అను అర్థము కదా సముద్రము నందు తరంగములు, తప్పక ఉండును. రత్నాకరము అనగా రత్నములకు గనియని అర్థము కనుకను సముద్రములో ముత్యములును, వివిధ రత్నములు లభించును గనుకనే ఈ రెండు భాగములలోని ప్రకరణములకు రత్నము - తరంగము అను రెండు పేర్లు ను చక్కగా సరిపోవును.
ప్రముఖ విద్వంసులు వ్రాసిన పీఠికలను తప్పక చదవగలరు. దానిచే ఈ సంకలన కర్తకు సంప్రదాయమునందు ఆదరము, ఆస్తికత్వమును, ధర్మనిష్టయు ఎంతగా ఉన్నవో మనకందరకును అవగతమగును. మనము వారి ఈ ఉత్తమభావనలను వారీ ఇన్ని ఉత్తమ విషయములను ఒక చోట కూర్చుటకై పడిన శ్రమను బాగుగ గ్రహించి ఈ పుస్తకమును చక్కగా వినియోగించుకోన్నచో మనము వారి సంకల్పము సార్ధకము చేసినవారము అవుదము.
- పాతూరి సీతారామాంజనేయులు
గతంలో మహాన్యాసపూర్వక రుద్రార్చనాభిషేక విధి, మహాన్యాసమంత్రవ్యాఖ్య, శ్రీ రుద్రాధ్యాయః, శ్రీ శివపురాణము లాంటి ఎన్నో ఉత్తమ శైవ గ్రంథ రాజములను ఆధ్యాత్మిక ప్రపంచానికి అందజేసియున్నాము. ఆకోవలోనే ఈ సత్గ్రంథము "శైవోత్సవరత్నాకరము" ను కూడ వెలువరించాము. ఈ గ్రంథ ప్రాచీన ప్రతిని మాన్యులు పాలెం వాస్తవ్యులు శ్రీ వల్లభరావు, కీ.శే. శ్రీ చింతలపూడి వెంకట సుబ్బారావు గారి కుమారులు. శ్రీ శివరామశర్మ, శ్రీ భావనారాయణ, శ్రీ వెంకటశివుడు గార్లు అందజేసారు. వారికి మా కృతఙ్ఞతలు. ఈ గ్రంథపు ప్రథమ భాగమునందలి ప్రకరణ విభాగములను రత్నములు అనియు, రెండవ భాగము నందలి ప్రకరణ విభాగములకు తరంగములనియు పేరులను సంకలన కర్తలుంచినారు. రత్నాకరము అనగా సముద్రము అను అర్థము కదా సముద్రము నందు తరంగములు, తప్పక ఉండును. రత్నాకరము అనగా రత్నములకు గనియని అర్థము కనుకను సముద్రములో ముత్యములును, వివిధ రత్నములు లభించును గనుకనే ఈ రెండు భాగములలోని ప్రకరణములకు రత్నము - తరంగము అను రెండు పేర్లు ను చక్కగా సరిపోవును. ప్రముఖ విద్వంసులు వ్రాసిన పీఠికలను తప్పక చదవగలరు. దానిచే ఈ సంకలన కర్తకు సంప్రదాయమునందు ఆదరము, ఆస్తికత్వమును, ధర్మనిష్టయు ఎంతగా ఉన్నవో మనకందరకును అవగతమగును. మనము వారి ఈ ఉత్తమభావనలను వారీ ఇన్ని ఉత్తమ విషయములను ఒక చోట కూర్చుటకై పడిన శ్రమను బాగుగ గ్రహించి ఈ పుస్తకమును చక్కగా వినియోగించుకోన్నచో మనము వారి సంకల్పము సార్ధకము చేసినవారము అవుదము. - పాతూరి సీతారామాంజనేయులు© 2017,www.logili.com All Rights Reserved.