మన భారతదేశమున అనేకులగు జ్యోతిషాచార్యులుద్భవించి జ్యోతిష సరస్వతి వారి కావ్య కుసుమమాలను అర్పించి ఎంతో వాసికెక్కిరి, అట్టి మహా ముహులలో అగ్రగణ్యుడుగా ఎన్నదగిన ఆచార్యుడు పంజరాజు ఈతడు ఉత్తర భారతదేశమునకు చెందిన వాడని తెలియబడుచున్నది. ఈతని కాలాదుల ఎంత ప్రయత్నము చేసినను లభించటలేదు. ఈతడు శంభురాజు అను రాజేంద్రుని వద్ద ఆస్థాన జ్యోతిష్కునిగా నుండి ఇతని ప్రభువగు శంభుభూపతి పేరును "శంభుహోరా ప్రకాశిక" అను ఈ జ్యోతిష గ్రంధమును రచించి ఆరాజునకే అంకిత మిచ్చెను . ఈతను తన గ్రంథమందు అతనికన్న పూర్వాచార్యులగు మానిసిద్ద సత్యాచర్యాదులను పేర్కొనియుండుటచే ఈతని వారి తరువాతి కాలము వాడని తెలియబడుచున్నది.
మహాజనులారా!