ఆయుర్వేదవైద్యం భారతీయ వైద్యపద్ధతుల్లో శిష్టమైనదీ. అనుభవైక వైద్యమైనదీనూ! మానవుడు ఎన్నో విషయాలను ప్రకృతినుంచి నేర్చుకుంటూవున్నాడు. కొన్నింటిని ఆకస్మికంగా నేర్చుకొంటే కొన్నింటిని అవసరంకొద్దీ నేర్చుకొంటుంన్నాడు. ఈ ఆయుర్వేద వైద్యానికి అవసరపడే దినుసులు ప్రధానంగా ప్రకృతి నుంచి లభించేవే. ప్రకృతిలో కనిపించే చెట్టూ, చేమా, మొక్క, కాయ, పండు, వేరు, పువ్వు అన్నీ ఆయుర్వేద వైద్యానికి దోహదపడేవే!
ఇప్పటికి కొన్నిప్రదేశాలలో అన్నిరోగాలకు కాకున్నా, చాలారోగాలకు తేనెసర్వరోగనివారిణి. అలాగే సర్పగంధీ రక్తపోటుకు మేలైన ఔషధంగా ఆయుర్వేదంలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకొంది. మరొక ఔషధ వృక్షం వేప, వేపనూనె పేలకు దివ్యౌషధం. పైగా క్రిమిసంహారిణి. వేపపుల్లతో దంతధావనం చేసుకొంటే పంటిపోతూ పిప్పిపంటివంటి బాధలకు దూరంగా వుంటాం! తలనొప్పి వచ్చినప్పుడు శొంఠీగంధం కణతలకు రాసుకొంటే ఆ బాధనుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే చెవిపోటు తీవ్రంగా బాధిస్తుంటే వెల్లుల్లిని మంచినూనెలో కాచి చల్లారిని తర్వాత చెవిలో వేసుకొంటే చప్పున గుణం కనపడుతుంది. ఈ వెల్లుల్లికీ రక్తపోటును అదుపుచేసే గుణం కూడావుంది.
ఇటివలకాలంలో ఆయుర్వేదంలో కూడా నూతన శాస్త్రీయపద్ధతుల్ని అనుసరించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వైద్యంలో ఏవిధమైన రహస్యం ఉండదు. అది శాస్త్రం కాబట్టి ఎవరైనా దాన్ని అభ్యాసం చేయవచ్చును. వ్యాధివచ్చిన తర్వాత వైద్యం చేసుకోవడంకంటె వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తపడడమే మేలని ఆయుర్వేదం బోధిస్తుంది. అన్ని రోగాలూ అందరికీ రావు. అన్ని రోగాలూ ఒకే మందుతో శమించవు. అనుభవం, ప్రయోగం ఒక్కొక్కప్రాంతానికి ఒక్కో విధంగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేద వైద్యం అనుభవ ప్రధానమైంది.
నేను ఈ గ్రంధాన్ని చాలా కాలంనుండి సంకలనపరుస్తూ వచ్చాను. తెలుగు పాఠకులు ప్రతి ఒక్కరు ఈ గ్రంథం వలన ప్రయోజనం పొందుతారని కోరుకుంటున్నాను.
- చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి.
ఆయుర్వేదవైద్యం భారతీయ వైద్యపద్ధతుల్లో శిష్టమైనదీ. అనుభవైక వైద్యమైనదీనూ! మానవుడు ఎన్నో విషయాలను ప్రకృతినుంచి నేర్చుకుంటూవున్నాడు. కొన్నింటిని ఆకస్మికంగా నేర్చుకొంటే కొన్నింటిని అవసరంకొద్దీ నేర్చుకొంటుంన్నాడు. ఈ ఆయుర్వేద వైద్యానికి అవసరపడే దినుసులు ప్రధానంగా ప్రకృతి నుంచి లభించేవే. ప్రకృతిలో కనిపించే చెట్టూ, చేమా, మొక్క, కాయ, పండు, వేరు, పువ్వు అన్నీ ఆయుర్వేద వైద్యానికి దోహదపడేవే! ఇప్పటికి కొన్నిప్రదేశాలలో అన్నిరోగాలకు కాకున్నా, చాలారోగాలకు తేనెసర్వరోగనివారిణి. అలాగే సర్పగంధీ రక్తపోటుకు మేలైన ఔషధంగా ఆయుర్వేదంలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకొంది. మరొక ఔషధ వృక్షం వేప, వేపనూనె పేలకు దివ్యౌషధం. పైగా క్రిమిసంహారిణి. వేపపుల్లతో దంతధావనం చేసుకొంటే పంటిపోతూ పిప్పిపంటివంటి బాధలకు దూరంగా వుంటాం! తలనొప్పి వచ్చినప్పుడు శొంఠీగంధం కణతలకు రాసుకొంటే ఆ బాధనుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే చెవిపోటు తీవ్రంగా బాధిస్తుంటే వెల్లుల్లిని మంచినూనెలో కాచి చల్లారిని తర్వాత చెవిలో వేసుకొంటే చప్పున గుణం కనపడుతుంది. ఈ వెల్లుల్లికీ రక్తపోటును అదుపుచేసే గుణం కూడావుంది. ఇటివలకాలంలో ఆయుర్వేదంలో కూడా నూతన శాస్త్రీయపద్ధతుల్ని అనుసరించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వైద్యంలో ఏవిధమైన రహస్యం ఉండదు. అది శాస్త్రం కాబట్టి ఎవరైనా దాన్ని అభ్యాసం చేయవచ్చును. వ్యాధివచ్చిన తర్వాత వైద్యం చేసుకోవడంకంటె వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తపడడమే మేలని ఆయుర్వేదం బోధిస్తుంది. అన్ని రోగాలూ అందరికీ రావు. అన్ని రోగాలూ ఒకే మందుతో శమించవు. అనుభవం, ప్రయోగం ఒక్కొక్కప్రాంతానికి ఒక్కో విధంగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేద వైద్యం అనుభవ ప్రధానమైంది. నేను ఈ గ్రంధాన్ని చాలా కాలంనుండి సంకలనపరుస్తూ వచ్చాను. తెలుగు పాఠకులు ప్రతి ఒక్కరు ఈ గ్రంథం వలన ప్రయోజనం పొందుతారని కోరుకుంటున్నాను. - చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి.© 2017,www.logili.com All Rights Reserved.