ప్రపంచంలోకెల్లా మన భారతదేశం అత్యున్నతం. వేదపురాణేతిహాసాలు, కావ్యాలు, నదులు, తీర్థాలు, దేవాలయాలు- దైవి సంపత్తితో కూడిన పుణ్యభూమి ఇది. ఆసేతు హిమాచలం ఎందరో మహానీయులు, ఋషిపుంగవులు అవతరించి జాతికి ధార్మిక జీవనాన్ని, వైదికమైన మోక్షమార్గాన్ని ఉపదేశించారు. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికములతో కూడిన నామరూప ప్రపంచ ద్రవ్యరాశి స్వర్గం వేదాధీనం. ప్రపంచ గతిని వేదాలు నిర్దేశిస్తున్నాయి. మానవ మనుగడనే కాక, సకల జీవుల యోగక్షేమాలను చర్చించేది వేదం. అట్టి వేదరాశి సమగ్ర సారమే శ్రీమద్రామాయణం. లోకపూజ్యమైన రామాయణాన్ని మనకందినచినది వాల్మీకి. ఈ అమృతగాథను ఎందరు కథలుగా చెప్పినా, ఎన్ని నామరూపాదులతో ముద్రించినా... తనివితీరని ఏదో అనూహ్య విషయాన్ని సమాజానికి సదా అందిస్తూనే ఉంది.
అట్టి దివ్యమైన రామకథను ఈ కాలంలో మా దీక్షితుల సుబ్రహ్మణ్యం ఒక సద్గ్రంథంగా అందించడం దైవానుగ్రహం. ఈ రచన మిగిలిన రచనలకు విభిన్నంగా, వినూత్నంగా ఉంది, అందరి హృదయాలను హత్తుకుంటుందనే భావన మాకు కలిగింది. గ్రాంథిక సమాసాలు లేకుండా సామాన్య జనులకు సైతం అర్థమయ్యేలా, పండితులనూ అలరించేలా రామాయణాన్ని ఎలా అందించాలో తెలిసినవాడు మా దీక్షితుల సుబ్రహ్మణ్యం. పేరుకు తగినట్టే ఈ కథ అమృత ధారగా కురిసి అందరిని తరిమ్పజేయాలని ఆశీర్వదిస్తున్నాం.
- శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి
ప్రపంచంలోకెల్లా మన భారతదేశం అత్యున్నతం. వేదపురాణేతిహాసాలు, కావ్యాలు, నదులు, తీర్థాలు, దేవాలయాలు- దైవి సంపత్తితో కూడిన పుణ్యభూమి ఇది. ఆసేతు హిమాచలం ఎందరో మహానీయులు, ఋషిపుంగవులు అవతరించి జాతికి ధార్మిక జీవనాన్ని, వైదికమైన మోక్షమార్గాన్ని ఉపదేశించారు. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికములతో కూడిన నామరూప ప్రపంచ ద్రవ్యరాశి స్వర్గం వేదాధీనం. ప్రపంచ గతిని వేదాలు నిర్దేశిస్తున్నాయి. మానవ మనుగడనే కాక, సకల జీవుల యోగక్షేమాలను చర్చించేది వేదం. అట్టి వేదరాశి సమగ్ర సారమే శ్రీమద్రామాయణం. లోకపూజ్యమైన రామాయణాన్ని మనకందినచినది వాల్మీకి. ఈ అమృతగాథను ఎందరు కథలుగా చెప్పినా, ఎన్ని నామరూపాదులతో ముద్రించినా... తనివితీరని ఏదో అనూహ్య విషయాన్ని సమాజానికి సదా అందిస్తూనే ఉంది. అట్టి దివ్యమైన రామకథను ఈ కాలంలో మా దీక్షితుల సుబ్రహ్మణ్యం ఒక సద్గ్రంథంగా అందించడం దైవానుగ్రహం. ఈ రచన మిగిలిన రచనలకు విభిన్నంగా, వినూత్నంగా ఉంది, అందరి హృదయాలను హత్తుకుంటుందనే భావన మాకు కలిగింది. గ్రాంథిక సమాసాలు లేకుండా సామాన్య జనులకు సైతం అర్థమయ్యేలా, పండితులనూ అలరించేలా రామాయణాన్ని ఎలా అందించాలో తెలిసినవాడు మా దీక్షితుల సుబ్రహ్మణ్యం. పేరుకు తగినట్టే ఈ కథ అమృత ధారగా కురిసి అందరిని తరిమ్పజేయాలని ఆశీర్వదిస్తున్నాం. - శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి© 2017,www.logili.com All Rights Reserved.