శ్రీకృష్ణావతారం శార్వరి గారి రచన. ఎందరో కృష్ణ కధలు రాశారు. ఎందరో కృష్ణలీలలు వర్ణించారు. మరెందరో కృష్ణ తత్వాన్ని ఆవిష్కరించ యత్నించారు. కాని కృష్ణ యోగాన్ని దర్శించినవారు అరుదు. శ్రీ శార్వరిగారి రచనలలో వారి ప్రత్యేక యోగముద్ర, భావముద్ర, తాత్విక చింతన స్పష్టంగా కనిపిస్తాయి. అది వారి యోగసాధనా ఫలితం. అది వారి ప్రజ్ఞా విశేషం. ఇది శార్వరిగారి రచన అని ఎవరైనా చెప్పగలరు. నాలుగు వాక్యాలు చదివితే చాలు... ఆ చదువుతున్నప్పుడే గుండె లోతుల్లో ఒక లయ వినిపిస్తుంది. ఒక ప్రకంపన తెలుస్తుంది. ఒక స్పందన కలుగుతుంది. ఒక చైతన్య స్ఫూర్తి మనస్సుకు తోస్తుంది.
'శ్రీ కృష్ణావతారం' ఒక కొత్త కోణం నుండి దర్శించిన రచన. శ్రీ కృష్ణుని ఎక్కడా శ్రుంగారలోలుడుగా చిత్రించడం జరగలేదు. సాధారణ మానవస్థాయి నుండి అతీతమానవ స్థితికి చేరడం ఎలాగో తెలుస్తుంది. శ్రీకృష్ణుని యోగతత్వాన్ని ఆవిష్కరించిన గ్రంధం బహుశా ఇదే మొదటిదేమో అనిపిస్తుంది.
శ్రీకృష్ణావతారం శార్వరి గారి రచన. ఎందరో కృష్ణ కధలు రాశారు. ఎందరో కృష్ణలీలలు వర్ణించారు. మరెందరో కృష్ణ తత్వాన్ని ఆవిష్కరించ యత్నించారు. కాని కృష్ణ యోగాన్ని దర్శించినవారు అరుదు. శ్రీ శార్వరిగారి రచనలలో వారి ప్రత్యేక యోగముద్ర, భావముద్ర, తాత్విక చింతన స్పష్టంగా కనిపిస్తాయి. అది వారి యోగసాధనా ఫలితం. అది వారి ప్రజ్ఞా విశేషం. ఇది శార్వరిగారి రచన అని ఎవరైనా చెప్పగలరు. నాలుగు వాక్యాలు చదివితే చాలు... ఆ చదువుతున్నప్పుడే గుండె లోతుల్లో ఒక లయ వినిపిస్తుంది. ఒక ప్రకంపన తెలుస్తుంది. ఒక స్పందన కలుగుతుంది. ఒక చైతన్య స్ఫూర్తి మనస్సుకు తోస్తుంది. 'శ్రీ కృష్ణావతారం' ఒక కొత్త కోణం నుండి దర్శించిన రచన. శ్రీ కృష్ణుని ఎక్కడా శ్రుంగారలోలుడుగా చిత్రించడం జరగలేదు. సాధారణ మానవస్థాయి నుండి అతీతమానవ స్థితికి చేరడం ఎలాగో తెలుస్తుంది. శ్రీకృష్ణుని యోగతత్వాన్ని ఆవిష్కరించిన గ్రంధం బహుశా ఇదే మొదటిదేమో అనిపిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.