శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము లోకములో అత్యంత ప్రసిద్ధమైన సహస్రనామ స్తోత్రాలు. శ్రీ లలితా సహస్రనామములో విష్ణు సహస్రనామములో లేని అనేక ప్రత్యేకతలు ఉన్నవి. ఇది శ్రీవిద్యకు ప్రామాణికమైన గ్రంథం. శ్రీ శంకర భగవత్పాదుల 'సౌందర్యలహరి' కూడా అంతే ప్రమాణ గ్రంథం. దీనితోపాటు 'కామకళా విలాసము' మొదలైనవి పాఠకులకు తోడ్పడే అనేక శాస్త్ర సముదాయము.
శ్రీవిద్య వేదకాలము నాటి నుండి ప్రసిద్ధిలో ఉన్న సంప్రదాయము. ఊహకు దీని రహస్యమును తనలో నిబిడీకృతము చేసికొనియున్నది. శ్రీసూక్తము శ్రీవైతులకు, శ్రీవిద్యా సాధకులైన శాక్తేయులకు పరమ ప్రమాణమైనది. అంతేకాక వేదములో పంచదశీమంత్ర సాధకముగా ఉన్న మంత్రములు కూడా ఈ సంప్రదాయము యొక్క ప్రాచీనతను వెల్లడించుతున్నవి.
శ్రీవిద్యకు ఆకరమైన శాక్తేయము అనేక దేవతా ఉపాసనల, ఉపాసనల లేదముల నాశ్రయించి అనంతముగా గోచరిస్తున్నది. దీనిలోని విద్యలు లెక్కబెట్టరానివి. ముఖ్యముగా శాక్తము దక్షిణాచార, వామాచార భేదములతో రెండు విధములుగా ఆచరణలో కానవస్తున్నది. అతి ప్రాచీనకాలములో బలులు, రక్తతర్పణములు, మద్య మాంసాదికములు నివేదించుట, ఒకానొక దశలో మైమనము కూడా ఒక అర్చనా విధానముగా భైరవీ భైరవ సాధనముగా మంకోటికి చేరినట్లు శాక్తేయము కానవస్తున్నది. బౌద్ధములో వజ్ర యూపదరూపంలో తంత్ర సాధన తీవ్రాతి తీవ్రముగ ఉన్నది. ఈ సాధన .క్రమముగా హిందూ శాక్తా సంప్రదాయములోనికి కూడా సంగమించినది.