ఉపాసకులు గమనించవలసిన ప్రధాన విషయం ఏమిటంటే? ఏ మంత్రం సాధన అయినా గ్రంథాలు చూసి చేస్తే ఫలించదు. మహామంత్రాలని సిద్ధిపొందిన గురువుల నుంచి ఉపదేశాన్ని పొంది, ఆ గురువు ఆదేశానుసారం వారి సూచనల ప్రకారం సాధన చేస్తేనే దేవతానుగ్రహం మంత్రసిద్ధి కలుగుతుంది. అలాకాక స్వతంత్రించి గ్రంధాలలోని మంత్రాలను ఉపాసిస్తే అవి వికటించి మేలుజరగకపోగా కీడు జరిగే అవకాశమే ఎక్కువ. అయితే లోకంలో కొంతమంది పండితులు దేవత భక్తుణ్ణి ఆదరిస్తుంది కానీ ఎప్పుడూ శిక్షించదు. కనుక భయపడాల్సిన పనిలేదని ఉద్భోదిస్తున్నారు.
వీరి మాట శాంతదేవతల విషయంలో కొంత వరకూ నిజమైనప్పటికీ ఉగ్రదేవతా సాధనల్లో అది దక్షిణాచారమైనా వామాచారమైనా సరియైన పద్ధతిలో గురువు ఉపదేశం లేకుండా మార్గదర్శనం లేకుండా మంత్రంసాధన చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా వరకూ ఉంది. కనుక సాధకులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. స్తోత్రాలు, కవచాలు, హృదయం వంటివి ఉపదేశం లేకపోయినా ఏకులంవారైనా స్త్రీలైనా పురుషులైనా నిర్భయంగా పారాయణ చేసుకోవచ్చు.
ఉపాసకులు గమనించవలసిన ప్రధాన విషయం ఏమిటంటే? ఏ మంత్రం సాధన అయినా గ్రంథాలు చూసి చేస్తే ఫలించదు. మహామంత్రాలని సిద్ధిపొందిన గురువుల నుంచి ఉపదేశాన్ని పొంది, ఆ గురువు ఆదేశానుసారం వారి సూచనల ప్రకారం సాధన చేస్తేనే దేవతానుగ్రహం మంత్రసిద్ధి కలుగుతుంది. అలాకాక స్వతంత్రించి గ్రంధాలలోని మంత్రాలను ఉపాసిస్తే అవి వికటించి మేలుజరగకపోగా కీడు జరిగే అవకాశమే ఎక్కువ. అయితే లోకంలో కొంతమంది పండితులు దేవత భక్తుణ్ణి ఆదరిస్తుంది కానీ ఎప్పుడూ శిక్షించదు. కనుక భయపడాల్సిన పనిలేదని ఉద్భోదిస్తున్నారు. వీరి మాట శాంతదేవతల విషయంలో కొంత వరకూ నిజమైనప్పటికీ ఉగ్రదేవతా సాధనల్లో అది దక్షిణాచారమైనా వామాచారమైనా సరియైన పద్ధతిలో గురువు ఉపదేశం లేకుండా మార్గదర్శనం లేకుండా మంత్రంసాధన చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా వరకూ ఉంది. కనుక సాధకులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. స్తోత్రాలు, కవచాలు, హృదయం వంటివి ఉపదేశం లేకపోయినా ఏకులంవారైనా స్త్రీలైనా పురుషులైనా నిర్భయంగా పారాయణ చేసుకోవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.