శ్రీ లింగ మహాపురాణం
అగ్నిలింగంలో ఉన్న శివుడుపదేశించిన పురాణమే లింగపురాణం. "లైంగం తుగుల్పకం దక్షమ్" శ్రీ మహా విష్ణువు కుడి చీలమండగ వర్ణితమైనదీ పురాణం. "తదేకాశసాహస్రం హరమహత్మ్య సూచకం" అనే వచనాన్ని బట్టి ఇందులో 11వేల శ్లోకాలున్నాయి. పుర్వార్ధంలో 108, ఉత్తరార్ధంలో 55 కలిపి 163 అధ్యాయాలున్నాయి. 28 విధాలైన శివావతరాలకు సంబంధించిన కధలీ పురాణంలో అగుపిస్తాయి. ఈ పురాణంలో రెండు విధాలైన శివసహస్ర నామం ఉన్నది.
యమ - నియమాదులనే అష్టాంగయోగాలతో శివారాధన విధానం, విష్ణువు చేసిన శివస్త్రోత్రం, మహా విష్ణువు యొక్క నాభికమలం నుండి బ్రహ్మదేవుని పుట్టుక, లింగార్చన విధానం, మానస శివపూజ, యుగధర్మాలు, సప్త సముద్రాలు, సప్తద్వీపాల వర్ణన, సూర్యదేవ మహత్మ్యం, సూర్య - చంద్ర వంశపు రాజుల వర్ణన, యయాతి చరితం, త్రిపురాసుర సంహారం, అహింస ప్రశంస, శివదర్శన ఫలం, కైలాసవర్ణన, నర - నారీమణులకు శుభప్రదమైన ఉమామహేశ్వర వ్రతం, సదాచార నిరూపణం, వారణాసి క్షేత్రమహాత్య్మం, పార్వతీ కళ్యాణం, వినాయక జన్మవృత్తాంతం, షోడశ మహాదాన వర్ణన - మొదలైన విషయాలు లింగపురాణం లో దర్శనమిస్తాయి.
లింగపురాణంలో శివుని ద్వారా సృష్టి ఆవిర్భావం చెందినదని, శివ సంబంధమైన అనేక వ్రతాలు, విశేషాలు ఇందులో ఉన్నాయి. ఇందులో శైవదర్శనాలకు అనుకూలమైన పశు, పాశ, పశుపతి శబ్దాల వివేచనాత్మక వ్యాఖ్య కనిపిస్తుంది. శివతత్త్వ మీమాంస అధ్యేతలకు చాలా ఉపయోగకరమైనది ఈ పురాణం.
శ్రీ లింగ మహాపురాణం అగ్నిలింగంలో ఉన్న శివుడుపదేశించిన పురాణమే లింగపురాణం. "లైంగం తుగుల్పకం దక్షమ్" శ్రీ మహా విష్ణువు కుడి చీలమండగ వర్ణితమైనదీ పురాణం. "తదేకాశసాహస్రం హరమహత్మ్య సూచకం" అనే వచనాన్ని బట్టి ఇందులో 11వేల శ్లోకాలున్నాయి. పుర్వార్ధంలో 108, ఉత్తరార్ధంలో 55 కలిపి 163 అధ్యాయాలున్నాయి. 28 విధాలైన శివావతరాలకు సంబంధించిన కధలీ పురాణంలో అగుపిస్తాయి. ఈ పురాణంలో రెండు విధాలైన శివసహస్ర నామం ఉన్నది. యమ - నియమాదులనే అష్టాంగయోగాలతో శివారాధన విధానం, విష్ణువు చేసిన శివస్త్రోత్రం, మహా విష్ణువు యొక్క నాభికమలం నుండి బ్రహ్మదేవుని పుట్టుక, లింగార్చన విధానం, మానస శివపూజ, యుగధర్మాలు, సప్త సముద్రాలు, సప్తద్వీపాల వర్ణన, సూర్యదేవ మహత్మ్యం, సూర్య - చంద్ర వంశపు రాజుల వర్ణన, యయాతి చరితం, త్రిపురాసుర సంహారం, అహింస ప్రశంస, శివదర్శన ఫలం, కైలాసవర్ణన, నర - నారీమణులకు శుభప్రదమైన ఉమామహేశ్వర వ్రతం, సదాచార నిరూపణం, వారణాసి క్షేత్రమహాత్య్మం, పార్వతీ కళ్యాణం, వినాయక జన్మవృత్తాంతం, షోడశ మహాదాన వర్ణన - మొదలైన విషయాలు లింగపురాణం లో దర్శనమిస్తాయి. లింగపురాణంలో శివుని ద్వారా సృష్టి ఆవిర్భావం చెందినదని, శివ సంబంధమైన అనేక వ్రతాలు, విశేషాలు ఇందులో ఉన్నాయి. ఇందులో శైవదర్శనాలకు అనుకూలమైన పశు, పాశ, పశుపతి శబ్దాల వివేచనాత్మక వ్యాఖ్య కనిపిస్తుంది. శివతత్త్వ మీమాంస అధ్యేతలకు చాలా ఉపయోగకరమైనది ఈ పురాణం.© 2017,www.logili.com All Rights Reserved.