మనకి ఏదైనా బాధ కలిగితే 'అమ్మా' అని బాధపడతాము. మనం ఉన్న పరిస్థితినీ వయస్సునీ - సమయాన్నీ బట్టి లోకంలో కనిపించే అమ్మ ఆ బాధను తీర్చవచ్చు తీర్చలేకపోవచ్చు. దైవం మనకు నిర్ణయించిన జీవనమార్గంలో పయనించే మనకు తగిలే ఎదురుదెబ్బల బాధను పోగొట్టేవారెవరు? తల్లిదండ్రులా, మిత్రులా, భార్యాబిడ్డలా? అదృష్టమా? ఈ ప్రశ్నకి సమాధానాలు రకరకాలు. ఇవన్నీ సరి అయిన సమాధానాలు రాని ప్రశ్నలు.
ఇలాంటి స్థితిలో మనం కనిపించే వాటి వలన ఉపయోగం పొందలేక కనిపించని ఆ దైవాన్ని ఆ శక్తిని తలచుకుంటాము. అమ్మా అని ఆర్తితో పిలుస్తాము. వేడుకుంటాము. బాధ చెప్పుకొనగలిగినదీ చెప్పుకోలేనిదీ అయినా మన మనోవేదనను ఆ శక్తి, ఆ తల్లి గమనించి మన ఆర్తిని, భక్తిశ్రద్ధలనీ, మన ప్రవృత్తినీ గమనించి మనయందు దయచూపి మన సమస్యలని అనుకోని రీతిలో పరిష్కరిస్తుంది. ఈ శక్తి, ఈ అమ్మ మన ఒక్కరికీ కాదు మనలాంటి వారందరికీ తల్లి అంటే సర్వజగత్తుకి తల్లి జగన్మాత.
మనకి ఏదైనా బాధ కలిగితే 'అమ్మా' అని బాధపడతాము. మనం ఉన్న పరిస్థితినీ వయస్సునీ - సమయాన్నీ బట్టి లోకంలో కనిపించే అమ్మ ఆ బాధను తీర్చవచ్చు తీర్చలేకపోవచ్చు. దైవం మనకు నిర్ణయించిన జీవనమార్గంలో పయనించే మనకు తగిలే ఎదురుదెబ్బల బాధను పోగొట్టేవారెవరు? తల్లిదండ్రులా, మిత్రులా, భార్యాబిడ్డలా? అదృష్టమా? ఈ ప్రశ్నకి సమాధానాలు రకరకాలు. ఇవన్నీ సరి అయిన సమాధానాలు రాని ప్రశ్నలు. ఇలాంటి స్థితిలో మనం కనిపించే వాటి వలన ఉపయోగం పొందలేక కనిపించని ఆ దైవాన్ని ఆ శక్తిని తలచుకుంటాము. అమ్మా అని ఆర్తితో పిలుస్తాము. వేడుకుంటాము. బాధ చెప్పుకొనగలిగినదీ చెప్పుకోలేనిదీ అయినా మన మనోవేదనను ఆ శక్తి, ఆ తల్లి గమనించి మన ఆర్తిని, భక్తిశ్రద్ధలనీ, మన ప్రవృత్తినీ గమనించి మనయందు దయచూపి మన సమస్యలని అనుకోని రీతిలో పరిష్కరిస్తుంది. ఈ శక్తి, ఈ అమ్మ మన ఒక్కరికీ కాదు మనలాంటి వారందరికీ తల్లి అంటే సర్వజగత్తుకి తల్లి జగన్మాత.© 2017,www.logili.com All Rights Reserved.