అతి ప్రాచీన రాజకవి హాలుని గాథాసప్తశతిలోని కథలలో చమత్కారం వుంటుంది. తగు మోతాదులో శృంగారం వుంటుంది. జీవనసత్యాలు వుంటాయి. ప్రాకృతంలో నాలుగే నాలుగు చిన్న పంక్తులలో యీ గాథలను హాలుడు నిక్షిప్తం చేశాడు. పెద్దలెందరో వాటిని విపులీకరించి, సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పారు. ఇక్కడ అలాంటి గాథ ఒకటి.
శార్వరి గురువుగారి అమ్మాయి. గురుకుల పాఠశాలలో తండ్రి పిల్లలకు చెప్పేవన్నీ శార్వరి శ్రద్ధగా వినేది. తండ్రి వద్ద ప్రత్యేకం చదవనూ చదివింది. సంస్కృత పంచకావ్యాలను పుక్కిలి పట్టింది. కాళిదాసుని, మాఘుణ్ణి అర్థం చేసుకుంది. వాల్మీకుని శిరసున ధరించింది. ఆశ్రమపాఠశాలలో ప్రకృతి మధ్య పెరిగింది. పచ్చలగద్దె కంటె పచ్చికబీళ్ళు మానసోల్లాసాన్నిస్తాయని గ్రహించింది.
శార్వరికి యీడొచ్చింది.
ఒక మధుమాసంలో శార్వరి నూతన వధువు అయింది. ఒహోం.... ఒహోం... ఓహోయన బోయీవాండ్రు, యీ మేనాలో అత్తవారింటికి సారెతో సహా శార్వరి సాగిపోయింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
అతి ప్రాచీన రాజకవి హాలుని గాథాసప్తశతిలోని కథలలో చమత్కారం వుంటుంది. తగు మోతాదులో శృంగారం వుంటుంది. జీవనసత్యాలు వుంటాయి. ప్రాకృతంలో నాలుగే నాలుగు చిన్న పంక్తులలో యీ గాథలను హాలుడు నిక్షిప్తం చేశాడు. పెద్దలెందరో వాటిని విపులీకరించి, సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పారు. ఇక్కడ అలాంటి గాథ ఒకటి.
శార్వరి గురువుగారి అమ్మాయి. గురుకుల పాఠశాలలో తండ్రి పిల్లలకు చెప్పేవన్నీ శార్వరి శ్రద్ధగా వినేది. తండ్రి వద్ద ప్రత్యేకం చదవనూ చదివింది. సంస్కృత పంచకావ్యాలను పుక్కిలి పట్టింది. కాళిదాసుని, మాఘుణ్ణి అర్థం చేసుకుంది. వాల్మీకుని శిరసున ధరించింది. ఆశ్రమపాఠశాలలో ప్రకృతి మధ్య పెరిగింది. పచ్చలగద్దె కంటె పచ్చికబీళ్ళు మానసోల్లాసాన్నిస్తాయని గ్రహించింది. శార్వరికి యీడొచ్చింది.
ఒక మధుమాసంలో శార్వరి నూతన వధువు అయింది. ఒహోం.... ఒహోం... ఓహోయన బోయీవాండ్రు, యీ మేనాలో అత్తవారింటికి సారెతో సహా శార్వరి సాగిపోయింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.