నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. నోరంటే మాట. ప్రియభాషణం ఇరుగు పొరుగులను విస్తరింప చేస్తుంది. ఇది వ్యక్తులకే కాదు దేశాలకు కూడా వర్తిస్తుంది. ప్రపంచీకరణ తరువాత మానవసంబంధాలనే మాట వినిపించడం ఎక్కువైంది. పాతరోజుల్లో ఊరంతా ఓ కుటుంబంలా ఉండేదని, పేర్లతో కాకుండా బాబాయ్, మావయ్య, అన్న, అక్క, పిన్ని అంటూ చుట్టరికాలతో పిలుచుకొనేవారానీ మన ముందుతరం వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు గ్లోబ్ కుదించుకుపోయింది. ఖండాలు, దేశాలు దగ్గరకు జరిగాయి. కేవలం అరనిమిషంలో ప్రపంచం మొత్తానికి ఓ వార్త అందించవచ్చు. ఒక సందేశం వినిపించవచ్చు. సందేశాల్ని ఎవరూ పట్టించుకోరు. అది వేరే విషయం.
గ్లోబలైజేషన్ మీద రకరకాల ఇతివృత్తాలతో కథలు వస్తున్న రోజుల్లో నేను మానవసంబంధాలను 'టాగ్ లైన్' గా పెట్టుకుని రంగంలోకి దిగాను. ఏదో ఒక చిన్న ముక్క పట్టుకుని, దానికి మాం. సం. లను తగిలించి పెనవేసుకుంటూ వెళ్ళడమే! టాపిక్స్ కి కొరత ఉండదు. కలం నుంచి కంప్యూటర్ దాకా.. ఆకాశమే హద్దు. అప్పట్లో ఆకాశం - మాసం, అంతరిక్షం - మాసం అని కూడా అందుకోవచ్చు. ఎటొచ్చీ అది రాసే వారికి పరిశ్రమ, చదివే వారికి శ్రమ అవుతుంది. అలా శ్రమకారాదని తెగ ప్రయత్నించా. ఎంతవరకు సఫలమయ్యానో పాఠకులు చదివాక చెప్పాలి.
శ్రీ రమణ
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. నోరంటే మాట. ప్రియభాషణం ఇరుగు పొరుగులను విస్తరింప చేస్తుంది. ఇది వ్యక్తులకే కాదు దేశాలకు కూడా వర్తిస్తుంది. ప్రపంచీకరణ తరువాత మానవసంబంధాలనే మాట వినిపించడం ఎక్కువైంది. పాతరోజుల్లో ఊరంతా ఓ కుటుంబంలా ఉండేదని, పేర్లతో కాకుండా బాబాయ్, మావయ్య, అన్న, అక్క, పిన్ని అంటూ చుట్టరికాలతో పిలుచుకొనేవారానీ మన ముందుతరం వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు గ్లోబ్ కుదించుకుపోయింది. ఖండాలు, దేశాలు దగ్గరకు జరిగాయి. కేవలం అరనిమిషంలో ప్రపంచం మొత్తానికి ఓ వార్త అందించవచ్చు. ఒక సందేశం వినిపించవచ్చు. సందేశాల్ని ఎవరూ పట్టించుకోరు. అది వేరే విషయం. గ్లోబలైజేషన్ మీద రకరకాల ఇతివృత్తాలతో కథలు వస్తున్న రోజుల్లో నేను మానవసంబంధాలను 'టాగ్ లైన్' గా పెట్టుకుని రంగంలోకి దిగాను. ఏదో ఒక చిన్న ముక్క పట్టుకుని, దానికి మాం. సం. లను తగిలించి పెనవేసుకుంటూ వెళ్ళడమే! టాపిక్స్ కి కొరత ఉండదు. కలం నుంచి కంప్యూటర్ దాకా.. ఆకాశమే హద్దు. అప్పట్లో ఆకాశం - మాసం, అంతరిక్షం - మాసం అని కూడా అందుకోవచ్చు. ఎటొచ్చీ అది రాసే వారికి పరిశ్రమ, చదివే వారికి శ్రమ అవుతుంది. అలా శ్రమకారాదని తెగ ప్రయత్నించా. ఎంతవరకు సఫలమయ్యానో పాఠకులు చదివాక చెప్పాలి. శ్రీ రమణ© 2017,www.logili.com All Rights Reserved.