మనసులో మాట
మనము ఈ భూమిపై జన్మించాము. మనకు ముందర మన తాతలు, ముత్తాతలు వారి ముందరి తరమువారు వస్తూ వచ్చారు. వీరికి మూల వృక్షమైన మొదటి మానవుడు ఈ భూమిపై ఎలా ఉద్భవించాడు. మన పరిసరాలలో తిరుగాడుతున్న జంతువులు, పశువులు, పక్షులు, ఈ వృక్షాలు మొట్టమొదటిగా ఈ భూమిపై ఎలా ఆవిర్భవించాయి. జీవి మరణానంతరము ప్రాణశక్తి ఏమవుతుంది. స్త్రీ, పురుషుల పుట్టుకలు ఇంచుమించు సమానముగా ఎలా జరుగుతున్నాయో మనకు తెలియదు. మనము భూమి ఒక గ్రహమని, అంతరిక్షములో అనేక గ్రహాలలో పరిభ్రమిస్తున్న ఒక గ్రహమని మనము చదువుకున్నాము. ఏ ఒక్క గ్రహము ఒకదానికొకటి ఢీకొట్టకుండా పరిభ్రమించడానికి కారణమేమిటి? (ఒకవేళ ఢీకొంటే మనము చనిపోతామని మనకు తెలుసు.) ఈ గ్రహాలన్నీ అంతరిక్షములో ఎలా ఆవిర్భవింపబడ్డాయి. మన కళ్ళ ఎదుట కనబడే సూర్యుడు ప్రతిరోజు ఉదయించకపోతే ఏమవుతుంది? సూర్యునిపై ఆధారపడే జీవులు ఆహారము పండక, జీవనాహారము లేక అంతమైపోతాయి. అయితే ఈ సూర్యుడు ఎలా అవతరించాడు.? రాత్రులు వెన్నెల కురిపించే చంద్రుడు ఎలా ఆవిర్భవించాడు.? వీటికి సమాధానము లేదు. మరి మనము ఎలా తెలుసుకోవడం! మనము జన్మించిన భూమిపై ఏమి జరుగుతుంది! దీనికి ఆధునిక విజ్ఞానశాస్త్రము ఏమి చెపుతుంది! ఎన్నో వేల నాటి వేదాలు, పురాణాలు ఏమి చెపుతున్నాయి! అని తెలుసుకోవడానికి ప్రయత్నమే ఈ పుస్తకము ఆవిర్భవింపబడడానికి కారణము.
భూమి ఆవిర్భావములో ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రకారము భూమి కొన్ని వందల కోట్ల సం||రాలు క్రిందట పెద్ద నక్షత్ర విస్ఫోటనము జరిగి (బిగ్ బ్యాంగ్) భూమి, సూర్యుడు, గ్రహాలు ఆవిర్భవింపబడ్డాయని, గ్రహాల విస్పోటనము ద్వారా జలము ఏర్పడి జలము నుండి జీవకోటి ఏర్పడిందని ఆధునిక శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. అయితే వేదాలు పురాణాల ప్రకారము ఈ సృష్టి ఏర్పడకముందు అంతా శూన్యమని, కొన్ని వందల కోట్ల సం||
రాల క్రితము జలములో అణువుల సంధానముతో బంగారు గుడ్డు ఆవిర్భవింపబడి, అందు నుండి విశ్వ స్వరూపుడు ఉద్భవించి సమస్త విశ్వమంతా వ్యాపించి, అతని శరీర భాగాల నుండి సమస్త దేవతలు అవిర్భవించినారనియు, ఆ విశ్వస్వరూపుని నాభి నుండి బ్రహ్మ ఉద్భవించినాడనియు వేద ఋషులు వివరిస్తున్నారు.,,,,,,,,,,,
మనసులో మాట మనము ఈ భూమిపై జన్మించాము. మనకు ముందర మన తాతలు, ముత్తాతలు వారి ముందరి తరమువారు వస్తూ వచ్చారు. వీరికి మూల వృక్షమైన మొదటి మానవుడు ఈ భూమిపై ఎలా ఉద్భవించాడు. మన పరిసరాలలో తిరుగాడుతున్న జంతువులు, పశువులు, పక్షులు, ఈ వృక్షాలు మొట్టమొదటిగా ఈ భూమిపై ఎలా ఆవిర్భవించాయి. జీవి మరణానంతరము ప్రాణశక్తి ఏమవుతుంది. స్త్రీ, పురుషుల పుట్టుకలు ఇంచుమించు సమానముగా ఎలా జరుగుతున్నాయో మనకు తెలియదు. మనము భూమి ఒక గ్రహమని, అంతరిక్షములో అనేక గ్రహాలలో పరిభ్రమిస్తున్న ఒక గ్రహమని మనము చదువుకున్నాము. ఏ ఒక్క గ్రహము ఒకదానికొకటి ఢీకొట్టకుండా పరిభ్రమించడానికి కారణమేమిటి? (ఒకవేళ ఢీకొంటే మనము చనిపోతామని మనకు తెలుసు.) ఈ గ్రహాలన్నీ అంతరిక్షములో ఎలా ఆవిర్భవింపబడ్డాయి. మన కళ్ళ ఎదుట కనబడే సూర్యుడు ప్రతిరోజు ఉదయించకపోతే ఏమవుతుంది? సూర్యునిపై ఆధారపడే జీవులు ఆహారము పండక, జీవనాహారము లేక అంతమైపోతాయి. అయితే ఈ సూర్యుడు ఎలా అవతరించాడు.? రాత్రులు వెన్నెల కురిపించే చంద్రుడు ఎలా ఆవిర్భవించాడు.? వీటికి సమాధానము లేదు. మరి మనము ఎలా తెలుసుకోవడం! మనము జన్మించిన భూమిపై ఏమి జరుగుతుంది! దీనికి ఆధునిక విజ్ఞానశాస్త్రము ఏమి చెపుతుంది! ఎన్నో వేల నాటి వేదాలు, పురాణాలు ఏమి చెపుతున్నాయి! అని తెలుసుకోవడానికి ప్రయత్నమే ఈ పుస్తకము ఆవిర్భవింపబడడానికి కారణము. భూమి ఆవిర్భావములో ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రకారము భూమి కొన్ని వందల కోట్ల సం||రాలు క్రిందట పెద్ద నక్షత్ర విస్ఫోటనము జరిగి (బిగ్ బ్యాంగ్) భూమి, సూర్యుడు, గ్రహాలు ఆవిర్భవింపబడ్డాయని, గ్రహాల విస్పోటనము ద్వారా జలము ఏర్పడి జలము నుండి జీవకోటి ఏర్పడిందని ఆధునిక శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. అయితే వేదాలు పురాణాల ప్రకారము ఈ సృష్టి ఏర్పడకముందు అంతా శూన్యమని, కొన్ని వందల కోట్ల సం|| రాల క్రితము జలములో అణువుల సంధానముతో బంగారు గుడ్డు ఆవిర్భవింపబడి, అందు నుండి విశ్వ స్వరూపుడు ఉద్భవించి సమస్త విశ్వమంతా వ్యాపించి, అతని శరీర భాగాల నుండి సమస్త దేవతలు అవిర్భవించినారనియు, ఆ విశ్వస్వరూపుని నాభి నుండి బ్రహ్మ ఉద్భవించినాడనియు వేద ఋషులు వివరిస్తున్నారు.,,,,,,,,,,,© 2017,www.logili.com All Rights Reserved.