మానవ జాతి పుటిన నాటి నుంచి నేటి వరకు నడచిన బాటలో ఎన్నో మెట్లున్నాయి. మలుపులున్నాయి. తెలిసిన ప్రతి కొత్త విషయం ఒక మెట్టు. ప్రతి మెట్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అట్లా ఎన్నో మెట్లను వాటివాటిచోట్లలో పెట్టెనందుకే నాగరికత అన్న నిర్మాణం ఇప్పుడున్న తీరుకు చేరుకున్నది. మెట్లు ఏ ఒకటి, కొంచెం పక్కకు జరిగినా మన తీరు మరోరకంగా ఉండేది. క్రమంగా తీర్చిన మెట్ల మీదుగా ప్రయాణం సాగింది. మానవజాతి మహూన్నత శిఖరాలకు చేరింది. సైన్స్ అనే ఈ నిర్మాణం రూపుపోకోసుకున్న తీరు ఎంతో ఆసక్తికరమయినది.
సైన్స్ ఎప్పుడు మొదలైనది అని ఎవరయినా సులభంగా ప్రశ్న అడగవచ్చు. సైన్స్ ముందు నుండి ఉండి, మధ్యలో మనిషి వచ్చాడా? లేక మనిషి వచ్చి సైన్స్ ను మొదలు పెట్టాడా అని మనలను మనం ప్రశ్నించుకుంటే సులభంగానే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆదిమానవుడు అనగానే మనకు "ఏమి తెలియని, మృగం లాంటి ఒక ప్రాణి" అన్న ఆలోచన కలుగుతుంది.
-కే.బి.గోపాలం.