విద్యారంగంపై విశ్లేషణలు చేయటం, పరిశోధనలు చేయటం, పరిష్కార మార్గాలు వెదకటం అంత సులభమైన పనేమీ కాదు. విద్యారంగం దేశానికి గుండె వంటిది. ఆ రంగం ఆగిపోతే దేశానికి కావాల్సిన రక్త ప్రసారం ఆగిపోయినట్లే. అందుకే విద్యారంగానికి సంబంధించి ఎంతో మంది విద్యావేత్తలు తమ అపారమైన అనుభవాన్ని జోడించి ఈ రంగాన్ని తీర్చి దిద్దటానికి కృషి చేశారు. కృషి చేస్తున్నారు.
పాఠశాల విద్యలో ఇంటర్ ను విలీనం చేయటం విద్యా వ్యవస్థ విధ్వంసానికే దారి తీస్తుందని శ్రీనివాస్ తేల్చి చెప్పాడు. దేశ వ్యాప్తంగా విద్యారంగం పై మార్కెట్ శక్తుల ఆధిపత్యం పెరిగిందని, దానికి సంకేతంగానే యశపాల్ కమిటి సిఫారసులున్నాయని ఆయన పలు కోణాల్లో వివరించారు. విద్యాహక్కు చట్టంపై శ్రీనివాస్ చేసిన విశ్లేషణ తాజా పరిణామాల నేపథ్యంలో నిజమనిపిస్తుంది. సామాజిక శాస్త్రాల రద్దు ఆలోచన మానవ వనరుల విధ్వంసమన్న శ్రీనివాస్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన చేసిన విశ్లేషణ ప్రశంసనీయమైనది. విద్యారంగంపై ప్రపంచీకరణ ప్రభావం ఏ మేరకుందో అది మన విద్యారంగంపై ఏ రకమైన ప్రభావం చూపుతుందో ఆయన ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
విద్యారంగంపై విశ్లేషణలు చేయటం, పరిశోధనలు చేయటం, పరిష్కార మార్గాలు వెదకటం అంత సులభమైన పనేమీ కాదు. విద్యారంగం దేశానికి గుండె వంటిది. ఆ రంగం ఆగిపోతే దేశానికి కావాల్సిన రక్త ప్రసారం ఆగిపోయినట్లే. అందుకే విద్యారంగానికి సంబంధించి ఎంతో మంది విద్యావేత్తలు తమ అపారమైన అనుభవాన్ని జోడించి ఈ రంగాన్ని తీర్చి దిద్దటానికి కృషి చేశారు. కృషి చేస్తున్నారు. పాఠశాల విద్యలో ఇంటర్ ను విలీనం చేయటం విద్యా వ్యవస్థ విధ్వంసానికే దారి తీస్తుందని శ్రీనివాస్ తేల్చి చెప్పాడు. దేశ వ్యాప్తంగా విద్యారంగం పై మార్కెట్ శక్తుల ఆధిపత్యం పెరిగిందని, దానికి సంకేతంగానే యశపాల్ కమిటి సిఫారసులున్నాయని ఆయన పలు కోణాల్లో వివరించారు. విద్యాహక్కు చట్టంపై శ్రీనివాస్ చేసిన విశ్లేషణ తాజా పరిణామాల నేపథ్యంలో నిజమనిపిస్తుంది. సామాజిక శాస్త్రాల రద్దు ఆలోచన మానవ వనరుల విధ్వంసమన్న శ్రీనివాస్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన చేసిన విశ్లేషణ ప్రశంసనీయమైనది. విద్యారంగంపై ప్రపంచీకరణ ప్రభావం ఏ మేరకుందో అది మన విద్యారంగంపై ఏ రకమైన ప్రభావం చూపుతుందో ఆయన ఈ పుస్తకంలో పేర్కొన్నారు.© 2017,www.logili.com All Rights Reserved.