భారత భూమి - కర్మ భూమి! భారతీయులు - కర్మిష్టులు!! " ధర్మార్థ కామ - మోక్షములు" అనే చతుర్విధ పురుషార్థ సిద్ధికి - నిరంతరమును పాటు బడుచు, అందలి భాగములు గానే... ఎల్లరు కర్మల నాచారింపుచున్నారు. ధర్మసిద్ధికి - వర్ణోచిత కర్మ కాండలను; అర్థ సిద్ధికి - వృత్తి - ఉద్యోగాది కర్మలను; కామ్య సిద్ధికి - యజ్ఞ, వ్రత, పూజ, జపాధులను; మోక్ష సిద్ధికి - తపో, యోగ, క్రతు కృత్యములను నెరపుచు... నిత్య జీవితములో... కర్మలకు ప్రాధాన్యత నిచ్చుట వలన... భారతీయులు - 'కర్మాచరణాసక్తులు' గా పేరును పొందియున్నారు.
"కామము" అనగా... కోరిక, ఇచ్చ, తలంపు! వీటి నాశ్రయించి ధర్మము నెలకొని యున్నది. కోరికలతో నిండిన మనో చిత్తములు గలిగిన మానవులు - "సర్వేజనాః కాంచన మాశ్రయంతి" యను విధంగా అర్థము నాశ్రయించక తప్పదు. అందు వలన... కామము - అర్థము నాధారముగా గొని యున్నది. ఈ ధర్మార్థ కామములు లేక... మోదమునకు నిలువ తావు లేదు. ఇట్టి పురుషార్థ చతుష్టయ సమ్మిలిత మైన కామమ" ని చెప్పక తప్పదు. అందువలననే... ఎన్ని గ్రంథములు రచింప బడినను, ఎందరెందరు పురాణోపన్యాసము లిచ్చినను.. కామ ప్రాధాన్యత కొట్టవచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది.
భారత భూమి - కర్మ భూమి! భారతీయులు - కర్మిష్టులు!! " ధర్మార్థ కామ - మోక్షములు" అనే చతుర్విధ పురుషార్థ సిద్ధికి - నిరంతరమును పాటు బడుచు, అందలి భాగములు గానే... ఎల్లరు కర్మల నాచారింపుచున్నారు. ధర్మసిద్ధికి - వర్ణోచిత కర్మ కాండలను; అర్థ సిద్ధికి - వృత్తి - ఉద్యోగాది కర్మలను; కామ్య సిద్ధికి - యజ్ఞ, వ్రత, పూజ, జపాధులను; మోక్ష సిద్ధికి - తపో, యోగ, క్రతు కృత్యములను నెరపుచు... నిత్య జీవితములో... కర్మలకు ప్రాధాన్యత నిచ్చుట వలన... భారతీయులు - 'కర్మాచరణాసక్తులు' గా పేరును పొందియున్నారు. "కామము" అనగా... కోరిక, ఇచ్చ, తలంపు! వీటి నాశ్రయించి ధర్మము నెలకొని యున్నది. కోరికలతో నిండిన మనో చిత్తములు గలిగిన మానవులు - "సర్వేజనాః కాంచన మాశ్రయంతి" యను విధంగా అర్థము నాశ్రయించక తప్పదు. అందు వలన... కామము - అర్థము నాధారముగా గొని యున్నది. ఈ ధర్మార్థ కామములు లేక... మోదమునకు నిలువ తావు లేదు. ఇట్టి పురుషార్థ చతుష్టయ సమ్మిలిత మైన కామమ" ని చెప్పక తప్పదు. అందువలననే... ఎన్ని గ్రంథములు రచింప బడినను, ఎందరెందరు పురాణోపన్యాసము లిచ్చినను.. కామ ప్రాధాన్యత కొట్టవచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది.I want this
© 2017,www.logili.com All Rights Reserved.